Maa Vande Jason Momoa: మన భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) జీవిత చరిత్ర గురించి ప్రతీ భారతీయుడు కచ్చితంగా తెలుసుకోవాలి. ఒక ఛాయ్ వాలా గా తన జీవిత ప్రస్థానం ని ప్రారంభించిన నరేంద్ర మోడీ, రాజకీయాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడు?, బీజేపీ లో పవర్ ఫుల్ నాయకుడిగా ఎలా ఎదిగాడు?, గుజరాత్ కి ముఖ్యమంత్రి అయ్యి, ఆ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేసి, దేశానికే ఒక రోల్ మోడల్ లాగా ఎలా మార్చాడు?, గుజరాత్ ని అభివృద్ధి చేసిన తీరుని చూసి దేశం మొత్తం మోడీ వేవ్ ఎలా వ్యాప్తి చెందింది?, ప్రధాన మంత్రి ఎలా అయ్యాడు?, ఒకసారి అవ్వడమే కష్టం అనుకుంటే , ఏకంగా మూడు సార్లు ప్రధాన మంత్రి అవ్వడం వెనుక ఆయన చేసిన అభివృద్ధి ఎలాంటిది?, ప్రపంచం లోనే మోస్ట్ పవర్ ఫుల్ నాయకుడిగా ఎలా ఎదిగాడు?, ఇవన్నీ నేటి తరం వాళ్ళు చూసి తెలుసుకోవాల్సిందే.
అందుకే నరేంద్ర మోడీ బయోపిక్ గా పై త్వరలోనే ‘మావందే'(Maa Vande Movie) పేరుతో ఒక సినిమా రాబోతుంది. ‘మార్కో’ ఫేమ్ ఉన్ని ముకుందన్(Unni Mukundan) ఇందులో నరేంద్ర మోడీ పాత్ర పోషిస్తున్నాడు. ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా గత ఏడాది విడుదల చేశారు. పాన్ ఇండియన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రాంతి కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రం స్కేల్ రోజురోజుకి పెరిగిపోతూ వెళ్తోంది. ఇప్పుడు ఈ సినిమాలోకి ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో జేసన్ మోమోవా ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఇతను ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన ‘ఆక్వా మెన్’ మూవీ లో హీరో గా నటించాడు. తెలుగు లో కూడా ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. అలాంటి హాలీవుడ్ స్టార్ చేత ఈ చిత్రం లో ఏ పాత్ర వేయించి ఉంటారో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు.
ప్రస్తుత హోమ్ మినిస్టర్ అమిత్ షా క్యారక్టర్ ని జేసన్ తో చేయిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాట. ఇందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి మరి. ఇకపోతే ఈ సినిమాకు KGF , సలార్ చిత్రాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ పని చేస్తున్నాడట. సాబు సివిల్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఇక #RRR చిత్రానికి ఫైట్ మాస్టర్ గా పని చేసిన కింగ్ సోలోమాన్ ఈ చిత్రానికి కూడా ఫైట్స్ ని కంపోజ్ చేయబోతున్నాడు. #RRR చిత్రం రామ్ చరణ్ ఇంట్రడక్షన్ ఫైట్ కి హాలీవుడ్ ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రానికి ఎలాంటి ఫైట్స్ ని కంపోజ్ చేయబోతున్నాడో చూడాలి.
