Mahesh Babu Sandeep Reddy Movie: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ…ఆ తర్వాత చేసిన ‘కబీర్ సింగ్’ ,’అనిమల్’ లాంటి సినిమాలు సైతం గొప్ప విజయాలను సాధించిపెట్టాయి. బాలీవుడ్ ఇండస్ట్రీ ని సైతం షేక్ చేసే స్థాయికి తను ఎదిగాడు. బాలీవుడ్ మాఫియా నుంచి ఎదురయ్యే పోటీని తిప్పికొట్టిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన మహేష్ బాబుతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబుకి కథను కూడా వినిపించాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ సంక్రాంతి రోజు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మహేష్ బాబు సైతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఆయన ఒక్కసారిగా ప్రపంచ స్థాయి హీరోగా మారబోతున్నాడు.
కాబట్టి తన తర్వాత సినిమా కూడా అంతే గ్రాండియర్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో అతను ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న దర్శకులలో అంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేయగలిగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మాత్రమే అని భావించిన మహేష్ సందీప్ కి సినిమా చేసే అవకాశం అయితే కల్పించినట్టుగా తెలుస్తోంది. మరి వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే అది ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.
ఇప్పటికే మహేష్ బాబు తో సినిమా చేయడానికి సందీప్ రెండు, మూడు కథలను కూడా రెడీ చేసి పెట్టాడు. వాటిలో ఏ కథ ఫైనల్ అవుతోంది అనేది పర్ఫెక్ట్ గా తెలియదు. కానీ మొత్తానికైతే వీళ్ళిద్దరి కాంబినేషన్ సెట్ చేయడానికి నమ్రత శతవిధాల ప్రయత్నం చేస్తోంది. సందీప్ తో మహేష్ చేసే సినిమాలో ఆయనను చాలా బోల్డుగా చూడబోతున్నాం అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఎందుకంటే సందీప్ సినిమాలో బోల్డ్ కంటెంట్ బోల్డ్ సీన్స్ లేకపోతే అతని అభిమానులు ఒప్పుకోరు. అలాగే సందీప్ కూడా తన మార్కును పోగొట్టుకునే అవకాశం లేదు. కాబట్టి ఫ్యామిలీ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంటూ మెప్పిస్తున్న మహేష్ బాబు బోల్డ్ సీన్స్ లో సైతం నటించే అవకాశం లేకపోలేదు…మరి దానిమీద మహేష్ అభిమానులు ఎలా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది…