Mahesh Babu And Sandeep Reddy Vanga: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు… ఈయన మొదటి సినిమాతోనే తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు… ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ 6 స్టార్ హీరోల్లో తను కూడా ఒకరిగా నిలవడం విశేషం… మహేష్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘వారణాసి’ అనే పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతుందట. రాజమౌళి మహేష్ బాబుని నెక్స్ట్ లెవెల్లో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక పురాణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైమ్ ట్రావెల్ ను బేస్ చేసుకొని ఉంటుంది. ఈ ఒక్క సినిమాతో మహేష్ బాబు పాన్ వరల్డ్ లో సైతం తన సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఈ సినిమాతో వచ్చిన ఇమేజ్ ను కాపాడుకోవాలంటే మాత్రం మహేష్ బాబు చాలా పకడ్బందీగా ప్రణాళికలను రూపొందించుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇప్పటికే ఆయన కోసం బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు సైతం కథలను సిద్ధం చేశారు. అయినప్పటికి ఆయన ఎవరి కథలను వినడం లేదు.
ఇక ఇంతకుముందు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో సినిమా చేయాలనుకున్న మహేష్ బాబు అది అనుకోని కారణాల వల్ల మిస్సయింది. కాబట్టి తన తదుపరి సినిమాని సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సందీప్ సైతం ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమా మీద తను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు.
గతంలో మహేష్ బాబుకు చెప్పిన కథకు సంబంధించి మహేష్ అతని భార్య నమ్రత ఇద్దరు కలిసి చాలావరకు డిస్కషన్స్ చేశారట. మొత్తానికైతే ఆ కథ మహేష్ బాబుకి బాగా సెట్ అవుతుందని తెలుసుకున్న వీళ్ళిద్దరూ సందీప్ ని పిలిపించుకొని మరి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామని చెప్పారట. కాకపోతే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడానికి మరికొద్ది రోజులు పట్టే సమయం అయితే ఉంది…
రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి మహేష్ బాబు తదుపరి సినిమా విషయంలో కూడా ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉంటాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉన్నప్పుడే సక్సెస్ సాధిస్తోంది. ఒకరకంగా సందీప్ రెడ్డి వంగ ఒక పెద్ద టాస్క్ ఎదుర్కోబోతున్నాడనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది…