Spirit Interval Fight: సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయింది. మొదటి షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన మేకర్స్ తొందరలోనే రెండో షెడ్యూల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సందీప్ రెడ్డి వంగా తన గత రెండు చిత్రాల కంటే భిన్నంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందు ప్రజెంట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం ప్రభాస్ ఇప్పటివరకు చేయనటువంటి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది… ప్రభాస్ ఈ సినిమాలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూనే ఒక కేసును డీల్ చేస్తూ ఉంటాడు. ఆ కేసులో భాగంగా ఇంటర్వెల్ సీన్ లో తను కొంతమంది పహిల్వాన్లతో ఫైట్ చేయాల్సి ఉంటుందట. ప్రభాస్ ఆ పైల్వాన్లను ఎలా ఎదుర్కొన్నాడు అనేది స్క్రీన్ మీద చూపించబోతున్నారు. ఆ ఫైట్ ను ఎక్స్ట్రాడినరీగా తెరకెక్కించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసమే వివిధ స్టంట్ మాస్టర్ల నుంచి డెమో వీడియోలను కూడా సందీప్ రెడ్డివంగా చేయిస్తున్నారట.
ఎందుకంటే తనకు పర్ఫెక్ట్ గా ఫైట్ ఎవరైతే చేయగలరో వాళ్ళతోనే ఆ ఫైట్ చేయించాలని ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఈ సినిమాలో హైలైట్ అయ్యే దాంట్లో ఇది కూడా ఒకటని అందువల్లే దాని మీద చాలా ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
నిజానికి సందీప్ రెడ్డి వంగా సినిమాలో పెద్ద ఫైట్లు ఏమీ ఉండవు. కానీ ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఉన్నప్పుడు తన అభిమానులు ప్రభాస్ నుంచి ఫైట్లను ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ల కోసమే ఈ ఫైట్ ను చాలా గ్రాండ్ గా డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సందీప్ రెడ్డివంగా సినిమాల్లో ఫైట్లు పెడితే ఎలా ఉంటుంది అనేది కూడా ఈ సినిమా ద్వారా మనకు చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది…
ఇక వీలైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ ను ఫినిష్ చేసి 2026 ఎండింగ్ కల్లా సినిమాని రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో సందీప్ రెడ్డివంగా ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…