https://oktelugu.com/

Pawan Kalyan: స్ట్రేటజీ మార్చిన పవన్.. అన్ని అంశాలపై ఫుల్ క్లారిటీ

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ స్ట్రేటజీ మార్చారా? ఎన్నికలకు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేశారా? పార్టీలోకి కీలక నాయకులు రానున్నారా? భారీగా చేరికలు ఉంటాయా? భావ సారుప్యం కలిగిన అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ప్రబలమైన శక్తిగా జనసేనాని అవతరించనున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా యాత్రకు సన్నద్ధమవుతున్నారా? అంటే పవన్ మాటలు అవుననే సమాధానం చెబుతున్నాయి. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన పవన్ అన్ని […]

Written By:
  • Dharma
  • , Updated On : May 21, 2022 / 08:14 AM IST
    Follow us on

    Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ స్ట్రేటజీ మార్చారా? ఎన్నికలకు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేశారా? పార్టీలోకి కీలక నాయకులు రానున్నారా? భారీగా చేరికలు ఉంటాయా? భావ సారుప్యం కలిగిన అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ప్రబలమైన శక్తిగా జనసేనాని అవతరించనున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా యాత్రకు సన్నద్ధమవుతున్నారా? అంటే పవన్ మాటలు అవుననే సమాధానం చెబుతున్నాయి. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన పవన్ అన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎన్నికలకు ఎలా వెళ్లాలో తమకు స్పష్టత ఉందన్నారు. రాష్ట్ర బీజేపీతో కలిసి పని చేస్తున్నా.. ప్రణాళికాలోపం ఉందని చెప్పారు. పొత్తులపై ఎలాంటి ఆలోచనా చేయలేదని. కానీ బీజేపీతో మాత్రమే కలిసి నడుస్తామని తేల్చిచెప్పారు.

    Pawan Kalyan

    ఇదే సమయంలో తమ భావాలకు అనుగుణంగా ఉండే పార్టీలు, వ్యక్తులు, సంస్థలు ఎవరు కలిసొచ్చినా కలుపుకొని వెళ్తానని కూడా స్పష్టతనిచ్చారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వకూడదని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కామన్‌మేన్‌ ప్రోగ్రాం ఉండాలన్నారు. వైసీపీ విధానాల వల్లే వ్యతిరేక ఓటు చీలదన్న వ్యాఖ్యలు చేశానని గుర్తుచేశారు. అయితే దీనిపై వైసీపీ నాయకులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. నన్ను తక్కువ చేసి మాట్లాడే నేతలు నా వ్యాఖ్యలు గురించి ఎందుకు పట్టించుకుంటున్నారని? వారికి ఎందుకంత కంగారుగా ఉందో తెలియడం లేదన్నారు. నాపై విమర్శలు చేసే మంత్రులు ఏమయ్యారని ప్రశ్నించారు ప్రజలకు సేవ చేయడం కన్నా నన్ను తిట్టడం మీదే కొంత మంది ఎక్కువ దృష్టిపెడుతున్నారని.. దానికి ప్రజలే సమాధానం చెబుతారన్నారు.

    Also Read: Jagananna Amma Vodi: ఈ సారి ‘అమ్మ ఒడి’ నుంచి రూ.2 వేలు కట్.. తల్లులకు జగన్ షర్కారు షాక్

    త్వరలో యాత్ర..
    రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేస్తానని పవన్ వెల్లడించారు. ప్రజల హృదయాలకు దగ్గరయ్యే విధంగా చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కులాలను విభజించే పనిలో వైసీపీ ఉందన్నారు. . బ్రిటిష్‌ వారి మాదిరిగా విభజించి పాలించు అనే విధానం పాటిస్తోందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. . బీసీల కోసం పదుల సంఖ్యలో కార్పొరేషన్లు పెట్టి కనీసం నిధులు కూడా ఇవ్వడం లేదన్నారు. పొత్తుల అంశం గురించి నన్ను చాలా మంది అడుగుతున్నారని… మాతో కలిసి వచ్చే వారితో నడుస్తామని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. నేనెప్పుడు ఏం మాట్లాడినా రాష్ట్ర ప్రయోజనాలకు లోబడి మాత్రమే ఆలోచించి మాట్లాడతానని తేల్చిచెప్పారు.. బీజేపీ రూట్‌ మ్యాప్‌ అనే మాట కూడా ఇరు పార్టీల పొత్తులో ఎలా ముందుకు వెళ్లాలనే అంశం మీద మాత్రమే ఉంటుందన్నారు. ముందస్తు ఎన్నికల అంశం ఇప్పుడే చెప్పలేమన్నారు. కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వైసీపీకి ఓటేయడం ఎంతవరకు కరెక్టో మేధావులు, పెద్దలు ఆలోచించాలని పవన్ కోరారు.

    Pawan Kalyan

    బీజేపీని సెట్ చేస్తా..
    త్వరలో బీజేపీ అగ్ర నాయకులతో మాట్లాడతానని.. కూర్చొని మాట్లాడితే చాలా విషయాలు సెట్టయ్యే చాన్స్ ఉందని చెప్పారు. నా విధానాలకు మద్దతివ్వాలా వద్దా అనేది బీజేపీ ఇష్టమన్నారు. నా అభిప్రాయాన్ని ఆ పార్టీ పెద్దలకు వివరిస్తానన్నారు. బీజేపీ విధానాలు ఎలా ఉన్నా.. నా నిర్ణయంపై సానుకూలంగా స్పందిస్తారనే భావిస్తున్నానని కూడా చెప్పారు. నాకు మోదీతో బాగా కనెక్షన్‌ ఉందని.. బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఏర్పడిన తర్వాత కలవడానికి షెడ్యూల్‌ కుదరలేదన్నారు. బీజేపీకి జాతీయ స్థాయిలో మంచి బలం ఉందన్నారు. రాజధాని విషయంలో రైతులకు ఆ పార్టీ అండగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు, అధ్వాన పరిస్థితి, ఆర్థిక సంక్షోభం కేంద్ర పెద్దలకు తెలుసన్నారు. బీజేపీ, జనసేన సమావేశాల్లో కూడా వైసీపీ వైఫల్యాలను చర్చించామని వివరించారు. రాష్ట్రం బలంగా ఉంటనే జనసేన బలంగా ఉంటుందన్నదే తన ప్రగాడ నమ్మకమన్నారు. . పార్టీలో చేరేందుకు చాలా మంది ఆసక్తిగా ఉన్నారని.. వారందరూ త్వరలో చేరే అవకాశముందన్నారు. ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలో ఇంకా నిర్ణయించలేదన్నారు. ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామన్న వైసీపీ వాళ్ల చాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని చెప్పారు.

    Also Read: CM Jagan- Davos Meeting: సీఎం జగన్ లండన్ లో ఎందుకు దిగినట్టు?

    Tags