RRR Movie Special Story: ట్రిపుల్ ఆర్ మూవీ నేడు థియేటర్లలో సందడి చేయనుంది. జక్కన్న చెక్కిన శిల్పం ట్రిపుల్ ఆర్ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానులను కనువిందు చేయనున్నారు. దీని కోసం అప్పుడే అంచనాలు పెరిగిపోతున్నాయి. కొద్ది గంటల్లోనే ఆర్ఆర్ఆర్ మూవీ అభిమానుల కల తీర్చనుంది. తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమడింపజేసిన రాజమౌళి బాహుబలితో ప్రపంచానికే తెలుగు సినిమా ప్రతిష్టను చాటిచెప్పిన ఘనుడు. ఆయన కలలోంచి పుట్టిందే ఈ ట్రిపుల్ ఆర్. దీంతో అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణకు ప్రతిరూపమే ట్రిపుల్ ఆర్ కావడం విశేషం.
రాజమౌళి ఆలోచన విజయేంద్రప్రసాద్ ఊహల సమ్మిళితమే ట్రిపుల్ ఆర్ కథ. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, గిరిజన పోరాట వీరుడు కొమురం భీం కలుసుకుంటే ఎలా ఉండేదో అనే ఆలోచనతో పురుడుపోసుకున్న కథే ఆర్ఆర్ఆర్. దీంతో దీనిపై అందరిలో ఆసక్తి పెరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలివియో మోరీస్, విలన్ గా రే స్టీవెన్ సన్ అలిసన్ డూడీ నటించాడు. కరోనా ప్రభావంతో సినిమా విడుదల విషయంలో ఆలస్యం జరిగినా జక్కన్న అనుకున్న దాని ప్రకారం తీయనిదే ఊరుకోరు. కథ అనుకున్నట్లు ఒదిగితేనే ఓకే అంటారు. లేదంటే మళ్లీ తీయాల్సిందే.
Also Read: Pavan Kalyan About RRR: ‘ఆర్ఆర్ఆర్’ టాక్ పై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
ఎన్టీఆర్ కు సింహాద్రి, రాంచరణ్ కు మగధీర వంటి హిట్లు ఇచ్చిన దర్శకుడు రాజమౌళి. అందుకే ఆయనతో సినిమా అంటే ఎగిరి గంతేస్తారు తెలుగు అగ్రహీరోలు. అలాంటిది ఆయన నుంచి పిలుపు రావడంతో ఇద్దరు వెళ్లి కథ వినకుండానే ఓకే చెప్పేశారట. అంటే రాజమౌళి అంటే అంత నమ్మకం. దీంతోనే ట్రిపుల్ ఆర్ కథకు ప్రాణం పోశారు. సినిమాను హైదరాబాద్, పూణే, గుజరాత్, ఉక్రెయిన్, బల్గేరియా లాంటి దేశాల్లో షూటింగ్ చేశారు. ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తీయడంలో రాజమౌళి సిద్ధహస్తులనే విషయం అందరికి తెలిసిందే.
రాజమౌళి అంటే యావత్ సినిమా ప్రపంచంలోనే మారుమోగుతున్న పేరు. బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన ఘనుడు. ఆయన సినిమా అంటే అందరికి ఉత్కంఠే. ఆయన నేర్పరితనం అలా ఉంటుంది. ప్రతి టేకింగ్ ను ఓ చాలెంజ్ గా తీసుకుని సినిమా నిర్మాణంలో తనదైన ముద్ర వేస్తాడు. సినిమా ఎలా అయితే విజయవంతమవుతుందో అనే ఆలోచన ఆయన సొంతం. అందుకే ఇప్పటివరకు ఆయనకు ఒక్కటి కూడా ఫెయిల్యూర్ లేదంటే అతిశయోక్తి కాదు. దీంతో ట్రిపుల్ ఆర్ పై కూడా అందరు ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా విజయవంతం కావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
టైటిల్ విషయంలో కూడా ఓ గమ్మత్తైన విషయం చోటుచేసుకుంది. ఆర్ఆర్ఆర్ అంటే రౌద్రం రణం రుధిరం గా అనుకున్నా రామారావు, రాంచరణ్, రాజమౌళి అని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు అదే ట్రెండ్ గా మారిపోయింది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్ పై కూడా ఇలా కావడం ఆశ్చర్యకరమే. మొత్తానికి నందమూరి, మెగా అభిమానులకు పండుగ కానుంది. ట్రిపుల్ ఆర్ తో తమ హీరోలు ఏ స్థాయికి వెళతారో ఊహించుకుంటున్నారు. ఇప్పటికే తెలుగులో అగ్రహీరోలుగా పిలువబడుతున్న వీరికి ట్రిపుల్ ఆర్ మంచి బ్రేక్ ఇచ్చి వారిని ఎక్కడికో తీసుకెళ్తుందనే ఊహల్లో ఉన్నారు.
Also Read: Mahesh Babu About RRR: ‘ఆర్ఆర్ఆర్’ రివ్యూ చెప్పిన మహేష్ !
Recommended Video: