Mahesh Babu Rejected Story: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరొక హీరో చేసి సూపర్ సక్సెస్ ని సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా కాకుండా ఒక హీరో రిజెక్ట్ చేసిన కథను మరొక హీరో చేసి ఫ్లాప్ ని మూట గట్టుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక కథను హీరోలు పర్ఫెక్ట్ గా జడ్జ్ చేయగలిగే కెపాసిటి ఉండాలి.
ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కూడా ప్లాప్ లను మూట గట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఒక మంచి సినిమాని వారి నుంచి చేజార్చుకున్న వారు కూడా అవుతారు. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు చేయాల్సిన ఒక సినిమాని ఒక యంగ్ హీరో చేసి భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే థాంక్యూ సినిమా కావడం విశేషం…
నాగచైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ సినిమాని మహేష్ బాబు తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కానీ మహేష్ బాబు ఆ కథను రిజెక్ట్ చేయడంతో వెంటనే ఆ కథను నాగచైతన్యకి చెప్పి ఒప్పించి ఆ సినిమాని చేశారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా మారింది చాలామంది ఈ సినిమాను చూడడానికి సైతం ఇష్టపడలేదు.
కారణం ఏదైనా కూడా నాగచైతన్య చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక థాంక్యూ సినిమా నాగచైతన్య ఇమేజ్ కి సరిగ్గా సరిపోతుందని అనుకున్నారు. కానీ సెట్ అవ్వలేదు. ఇక మహేష్ బాబు కైతే ఈ సినిమా అసలు సెట్ అయ్యేది కాదు. మొత్తానికైతే ఈ సినిమా డిజాస్టర్ గా మారింది. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు ఒక ప్లాప్ సినిమా నుంచి తప్పించుకున్నాడు అంటూ అతని అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికైతే ఒక హీరోకి సినిమా కథను జడ్జ్ చేయడం అనేది పర్ఫెక్ట్ గా రావాలి. లేకపోతే మాత్రం ప్లాప్ లను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది…