Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి క్రేజ్ ఉంది. చిరంజీవి తమ్ముడి గా ఇండస్ట్రీకి వచ్చినప్పటికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి తను ఎదగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే సమయం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. గత సంవత్సరం ఓజీ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఈ సంవత్సరం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. అయినప్పటికి పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎక్కడ తగ్గలేదు… మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పటికి అది వర్కౌట్ కాలేదు.
ఇక రాబోయే రోజుల్లో మరికొన్ని సినిమాలకు కమిటై ఆ సినిమాలను సూపర్ సక్సెస్ గా నిలుపడానికి పవన్ కళ్యాణ్ తన సహాయ శక్తుల ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక కెరీర్ స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ కి వరుస సక్సెస్ లు దక్కాయి. అందులో ‘బద్రి’ సినిమా ఒకటి…
ఆ మూవీతో ఆయన భారీ సక్సెస్ ని అందుకున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమీషా పటేల్ పవన్ కళ్యాణ్ కి లక్కీ హీరోయిన్ గా మారింది. అమీషా పటేల్ ఆ తర్వాత కాలంలో మహేష్ బాబు తో ‘నాని’, జూనియర్ ఎన్టీఆర్ తో ‘నరసింహుడు’ లాంటి సినిమాలు చేసింది.
పవన్ కళ్యాణ్ సక్సెస్ ను కట్టబెట్టిన ఆమె మహేష్ బాబు, ఎన్టీఆర్ లకు మాత్రం డిజాస్టర్ సినిమాలను అందించింది. దాంతో మహేష్ బాబు, ఎన్టీఆర్ అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేశారు. ఇక ఆ తర్వాత ఆమె తెలుగులో పెద్దగా సినిమాలైతే చేయలేదు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ కొన్ని సినిమాలు చేసింది. అక్కడ కూడా అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయింది…