Bollywood Decline: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. ఒకరిని దాటి మరొకరు ముందుకు దూసుకెళ్తున్నారు అనే విషయం తెలిసిన వెంటనే ఆయా హీరోలు సైతం ఇతర హీరోలకు మించిన సినిమాలను చేయడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు వాళ్ల మధ్య పోటీని పెట్టుకోవడమే కాకుండా ఇతర భాషల హీరోలతో సైతం పోటీపడి భారీ విజయాలను సాధించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు ఇండియాలో నెంబర్ వన్ హీరోలుగా కొనసాగుతూ ఉండేవారు. కానీ మనం పక్కకు పెట్టి ఎలాగైనా సరే వాళ్ళను పక్కకి నెట్టి మనం టాప్ లోకి వెళ్లాలని సౌత్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలందరు ప్రయత్నం చేశారు. కానీ అది అప్పట్లో వర్కౌట్ కాలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీ అంతకంతకు ఎదుగుతూ వచ్చింది.
కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ పతనం స్టార్ట్ అయింది. దాన్ని చూసిన సౌత్ సినిమా ఇండస్ట్రీ మొత్తం సంబరాలు చేసుకుంటున్నారనే చెప్పాలి. కారణం ఏంటంటే ఒకప్పుడు బాలీవుడ్ హీరోలతో సౌత్ డైరెక్టర్లు సినిమాలు చేయాలంటే చాలా కష్టతరం అయ్యేది. బాలీవుడ్ హీరోలు మన వాళ్ళు చెప్పే కథలను వినేవారు కాదు.
మనవాళ్ళు ఇలాంటి చాలా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొని వచ్చారు. కాబట్టి ఇప్పుడు మన సౌత్ సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీ ని డామినేట్ చేస్తూ నెంబర్ వన్ పొజిషన్ ను అందుకునే స్థాయికి చేరుకుంది. కాబట్టి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ పతనం చూసి చాలామంది నవ్వుకుంటున్నారు… ఒకప్పుడు వాళ్లకు చాలా ఆటిట్యూడ్ ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు.
ప్రస్తుతం సౌత్ సినిమా దర్శకులతో సినిమాలు చేయడానికి అక్కడి హీరోలు తీవ్రమైన ఆసక్తిని చూపిస్తున్నారు. ఖాన్ త్రయంతో పాటు మిగిలిన యంగ్ హీరోలు కూడా డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ వరుస సక్సెస్ లను సాధించి మరోసారి టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోతుందా? లేదంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచే ఎదురయ్యే పోటీని తట్టుకోలేక డీలా పడి పోతుందా అనేది తెలియాల్సి ఉంది…