Mahesh Babu Varanasi: కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న #Globetrotter ఈవెంట్ కాసేపటి క్రితమే మొదలైంది. ఈవెంట్ మొదలు అవ్వగానే జియో హాట్ స్టార్ పై ఒక్కసారిగా మహేష్ బాబు(Superstar Mahesh Babu) ఫ్యాన్స్ మూక్కుమ్మడిగా దాడి చేశారు. ఇదంతా పక్కన పెడితే రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతున్న ఈ ఈవెంట్ కి అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. వాళ్ళ కోసం మూవీ టీం రాకముందే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు. ఈ వీడియో లో మహేష్ బాబు ఉగ్రరూపం దాల్చి దున్నపోతు మీద త్రిసూలం పట్టుకొని సవారి చేస్తూ రావడం అభిమానులకు మాత్రమే కాదు, ఆడియన్స్ కి కూడా రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది. మహేష్ బాబు ఇన్ని రోజులు చూడడం ఒక ఎత్తు, రాజమౌళి(SS Rajamouli) చూపించిన విధానం మరో ఎత్తు అంటూ సోషల్ మీడియా లో ఈ లుక్ ని చూసిన ప్రతీ ఒక్కరు పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు.
అయితే ఈ గ్లింప్స్ వీడియో ని చూసిన తర్వాత అందరికి వచ్చిన డౌట్ ఏమిటంటే, అసలు ఈ చిత్రానికి దర్శకుడు రాజమౌళి నా?, లేదా బోయపాటి శ్రీను నా అని అనిపించింది. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాకు ‘వారణాసి'(Varanasi Movie) అని టైటిల్ పెట్టడం ఏంటి?, లోకల్ మాస్ సినిమాలో ఉన్న విధంగా ఆ విజువల్స్ ఏంటి అంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఈ చిత్రం ద్వారా రాజమౌళి మన ఇండియన్ లోకల్ మాస్ ని ప్రపంచం మొత్తం తెలియజేయబోతున్నాడా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కానీ మహేష్ బాబు లుక్స్, కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది కదా మహేష్ బాబు నుండి ఇన్ని రోజులు మేము కోరుకున్నది, ఎంతైనా రాజమౌళి రూటే సపరేట్ ఆంటూ పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు మహేష్ ఫ్యాన్స్.