Varanasi Movie Shooting Break: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) , రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ (Varanasi Movie) చిత్రం కోసం , అభిమానులు , ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. అంటే సరిగా వచ్చే ఏడాది ఈ సమయానికి మనమంతా ‘వారణాసి’ యూఫోరియా లో మునిగి తేలుతూ ఉంటాం అన్నమాట. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లోని శంకర్ పల్లి లో జరుగుతోంది. మహేష్ బాబు తో పాటు, ప్రియాంక చోప్రా, పృథ్వి రాజ్ లు కూడా నేటి షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్ పూర్తి అయ్యాక 80 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. రాజమౌళి కెరీర్ ల ఇంత వేగంగా పూర్తి అవుతున్న సినిమా ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేదు. ‘వారణాసి’ కి ఆ అరుదైన ఘటన జరగబోతుంది.
సెప్టెంబర్ లోపు షూటింగ్ ని పూర్తి చెయ్యాలి అనేది ముందుగా అనుకున్న ప్లాన్ , కానీ అంతకంటే ముందే ఈ సినిమా రెడీ అయ్యేలా ఉందట. అందుకే ఈ షెడ్యూల్ తర్వాత ఒక చిన్న బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకోబోతున్నారు మహేష్ బాబు, రాజమౌళి. మహేష్ తన కుటుంబం తో కలిసి విదేశాలకు త్వరలోనే టూర్ కి వెళ్లబోతున్నాడు. అదే విధంగా రాజమౌళి కూడా విదేశాలకు వెళ్లబోతున్నాడు అట. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత నూతనోత్సాహం తో ఏఈ సినిమా కు సంబంధించిన మిగిలిన 20 శాతం షూటింగ్ ని పూర్తి చేస్తారట. ఇకపోతే ఈ ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఎదో ఒక అప్డేట్ వస్తుందని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మహేష్ బాబు శ్రీరాముడి గెటప్ లో ఉండే లుక్ కి సంబంధించిన టీజర్ విడుదల చేస్తారట. ఈ టీజర్ విడుదలైన రోజు దేశం మొత్తం ‘వారణాసి’ ఒక సెన్సేషనల్ టాపిక్ గా మారబోతుందని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ కూడా రానుంది అట. VFX కోసం ఒక ప్రముఖ హాలీవుడ్ సంస్థ పని చేస్తోంది. ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడనటువంటి అద్భుతమైన విజువల్స్ ని ఈ సినిమాలో చూపించబోతున్నాడట రాజమౌళి.
