Mahesh Babu and Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి (Rajamouli)…ఆయన చేసిన సినిమాలన్నీ అతన్ని చాలా ఉన్నతమైన స్థానంలో నిలిపాయి. ఆయన చేసిన 12 సినిమాల్లో 12 సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ప్రేక్షకుల్లో అతను చెరగని ముద్ర వేసుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో రాజమౌళి చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన ఒక సినిమాని స్టార్ట్ చేస్తాడో అప్పటినుంచి ఆ సినిమా మీద తీవ్రమైన కసరత్తులు చేసి ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతూ ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలు ఎలాంటి ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాయి. తద్వారా ఆయన కంటూ ఎలాంటి ఐడెంటిటీని సంపాదించి పెడతాయి అనే విషయంలో కూడా ఆయన కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.
Also Read : మహేష్ బాబు సినిమాకోసం రాజమౌళి మొదటి సారి ఇలా చేస్తున్నాడా..?
ఈ సినిమాతో ఏకంగా ప్రపంచం లో ఉన్న రికార్డులను సైతం బ్రేక్ చేయాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఉన్నాడట. ఇక ఇప్పటికే ఈ సినిమాకి 1000 కోట్లకు పైన బడ్జెట్ అయితే కేటాయించారు. మరి ఈ బడ్జెట్ ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని సినిమా పెద్దలు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం.
ఇక మొదటి షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న సినిమా యూనిట్ రెండోవ షెడ్యూల్ ను సైతం శరవేగంగా పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఇప్పటికే మహేష్ బాబు మీద కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించే పనుల్లో రాజమౌళి ఉన్నాడట. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ సారధ్యంలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో దాదాపు 50 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారట.
ఇక ఈ ఫైట్ ను మనం థియేటర్లో చూస్తే ప్రతి ఒక్కరికి పూనకాలు వస్తాయంటూ రాజమౌళి టీమ్ చెప్తున్నారు. నిజానికి రాజమౌళి లాంటి దర్శకుడి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మాత్రం పాన్ వరల్డ్ లో ఉన్న ప్రేక్షకులు సైతం ఆయన సినిమా కోసం ఆసక్తి గా ఎదురు చూస్తూ ఉండడం విశేషం.
Also Read : 3000 మందితో పడవలో మహేష్ బాబు పోరాటం..రాజమౌళి మార్క్ సన్నివేశం!