Mahesh Babu and Rajamouli : ప్రపంచం లో ఉన్న సినీ అభిమానులు మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్స్ లో ఒకటి మహేష్ బాబు(Super Star Mahesh Babu) రాజమౌళి(SS Rajamouli) సినిమా. ఈ చిత్రం(#SSRMB) ఎప్పుడో దశాబ్దం క్రితమే ఖరారు అయ్యింది. కాని అది కార్యరూపం దాల్చడానికి ఇన్నేళ్ల సమయం పట్టింది. రీసెంట్ గానే ఈ సినిమాలో నటించే నటీనటులకు సంబంధించిన లుక్ టెస్ట్స్ మొత్తం పూర్తి చేసారు. మహేష్ బాబు లుక్ కూడా అనేక సందర్భాల్లో లీక్ అయ్యింది. ఇప్పటి వరకు అభిమానులు కలలో కూడా ఊహించని లుక్ లో మహేష్ బాబు కనిపించబోతున్నాడు. రీసెంట్ గానే మూవీ టీం మొదటి షెడ్యూల్ షూటింగ్ కోసం ఒడిశా కి వెళ్ళింది. ఈ షెడ్యూల్ లో పాల్గొనేందుకు మహేష్ బాబు, పృథ్వీ రాజ్(Prithviraj Sukumaran) విమానాశ్రయం లో కనిపించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అయితే నేడు ఈ చిత్రం షూటింగ్ కి సంబంధించిన వీడియో ఒకటి విడుదలైంది.
Also Read : జూనియర్ ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీ టైటిల్ తో మహేష్ బాబు, రాజమౌళి సినిమా తెరకెక్కుతుందా..? ఇదేమి ట్విస్ట్ సామీ!
ఈ షూటింగ్ వీడియో లో మహేష్ బాబు రింగుల జుట్టుతో చాలా మాస్ గా కనిపించాడు. ఎవరూ లేని ఖాళీ ప్రదేశం లో మహేష్ ని సెక్యూరిటీ సిబ్బంది నెట్టుకుంటూ ముందుకొస్తాడు. ఆ తర్వాత వీల్ చైర్ లో కూర్చున్న పృథ్వీ రాజ్ ముందు మోకాళ్ళ మీద కూర్చోబెడుతాడు. చూస్తుంటే ఈ సినిమా రాజమౌళి మార్క్ ఊర మాస్ కమర్షియల్ సినిమాలాగా అనిపిస్తుంది. బాహుబలి నుండి రాజమౌళి తీసిన సినిమాలన్నీ పీరియాడిక్ జానర్ లో ఉన్నవే. కేవలం ఈ సినిమా ఒక్కటే వర్తమానం లో నడిచే స్టోరీ లాగా అనిపిస్తుంది. ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఎలాంటి విరామం లేకుండా ఏడాది లోపు షూటింగ్ ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి. అందుకు తగ్గ ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ ప్లాన్ చేసుకున్నాడట. అయితే ఈ సినిమా నుండి చిన్న సమాచారం కూడా సోషల్ మీడియా లో లీక్ అవ్వకుండా ఉండేలా రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
షూటింగ్ లొకేషన్ లో మొబైల్ ఫోన్స్ ని తీసుకొని రాకూడదని ఒక కఠినమైన నిబంధన కూడా పెట్టాడు. అయినప్పటికీ ఈ వీడియో ని ఎవరు రహస్యంగా షూట్ చేసారు?, ఎవరు సోషల్ మీడియా లో విడుదల చేసారు అనేది అర్థం కావడం లేదు. ఒకవేళ ఈ వీడియో ని లీక్ చేసిన వాళ్ళు దొరికితే రాజమౌళి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. గతంలో #RRR కి సంబంధించిన షూటింగ్ వీడియోలు కూడా ఇలాగే సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. ఆ చర్యలకు పాల్పడిన వారిపై రాజమౌళి మరియు మూవీ టీం చాలా కఠినమైన చర్యలు తీసుకుంది. మళ్ళీ అలాంటి రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ సోషల్ మీడియా యుగం లో సమాచారాలు గోప్యంగా ఉంచడం చాలా కష్టమైన పని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Also Read : ఒడిశాలో మహేష్ బాబు, రాజమౌళి మూవీ షూటింగ్..అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్ అతి త్వరలో!