China Bridge Collapse: సాధారణంగా ప్రమాదాలు చెప్పి రావు. ప్రమాదాలు అనుకోకుండానే జరుగుతాయి. ఆ సమయంలో మనం ఆ ప్రమాదంలో చిక్కుకుంటే అంతే సంగతులు. ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే కొన్ని సందర్భాలలో ప్రమాదాలు భారీగా చోటు చేసుకున్నప్పటికీ.. కొంతమంది ప్రాణాలతో బయటపడుతుంటారు.. బతుకు జీవుడా అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటారు. అలాంటి సంఘటన ఒకటి జరిగింది. కాకపోతే అక్కడ జరిగిన ప్రమాదం మామూలుగా లేదు. సోషల్ మీడియాలో ఆ వీడియోను చూస్తుంటే చేతులు గజాగజా వణికి పోతున్నాయి. ఒళ్ళు జలదరించిపోతున్నది. ఇంతకీ అక్కడ జరిగిన ప్రమాదం? ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఎలా ఉన్నాయంటే..
Also Read: మహేష్ బాబు – రాజమౌళి సినిమా మూడో షెడ్యూల్లో పాల్గొంటున్న పాన్ ఇండియా స్టార్స్ వీళ్ళే…
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు కనిపిస్తున్నాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. సోషల్ మీడియాలో ఉన్న సమాచారం ప్రకారం ఈ సంఘటన చైనాలో జరిగినట్టు తెలుస్తోంది.. ఈ సంఘటనలో ఓ లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాద రూపంలో మృత్యువు అతడి దగ్గర వరకు వచ్చింది. సెంటీమీటర్ దూరంలో చావు కళ్ళముందు కనిపించింది. అయితే అతడికి భూమ్మీద నూకలు ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన చైనాలోని గుయిజౌ ప్రావిన్స్ ప్రాంతంలో చోటుచేసుకుంది. విపరీతంగా కురుస్తున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో హైవే మీద ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. అదే సమయంలో ఒక భారీ ట్రక్కు ఆ మార్గంలో వస్తోంది. వంతెన కూలిపోయిన విషయం ఆ ట్రక్కు డ్రైవర్ కు తెలియదు..
ఆ ట్రక్కు డ్రైవర్ వేగంతో దూసుకు వస్తుండగా వంతెన కూలిపోయిన విషయాన్ని చూశాడు. వెంటనే ట్రక్కును ఆపాడు. అయితే ట్రక్ ముందు భాగం వంతెన చివరి వరకు వచ్చింది.. అక్కడే ఆగిపోయింది. ట్రక్కు ముందు భాగం గాలిలో తేలుతూ కనిపించింది. కాస్త ముందుకు వస్తే ఆ ట్రక్కు కింద పడిపోయేది. ఆ డ్రైవర్ అందులో పడి చనిపోయేవాడు. అతడికి భూమ్మీద నూకలు ఉండడంతో ట్రక్కు ముందు భాగం వరకే వచ్చింది. దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. భూమ్మీద నూకలు ఉన్నాయి కాబట్టే అతడు బతకగలిగాడని నెటిజన్లు అంటున్నారు. ” అంతటి ప్రమాదం భయాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి ఆ దృశ్యం చూస్తేనే ఆందోళన కలుగుతోంది. అలాంటిది అతడు బ్రేక్ వేసి తన ప్రాణాలు కాపాడుకోగలిగాడు. అతడు నిజంగా మృత్యుంజయుడు. చావు నుంచి అత్యంత చాకచక్యంగా తప్పించుకోగలిగాడని” నెటిజన్లు అంటున్నారు.