Mahesh Babu and Rajamouli : దర్శకధీరుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి (Rajamouli)…ఆయన ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్స్ ను సాధిస్తూ ముందుకు సాగుతున్నవే కావడం విశేషం… బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాను చేసి ఎవరికి దక్కని గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకుడిగా మారాడు. ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా మారడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో అతని డైరెక్షన్లో ఒక్క సినిమా అయినా చేయాలని ఇప్పటికీ కోరుకుంటున్నారు అంటే ఆయన స్టార్ డమ్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక సినిమాని తీయడంలో ఆయన మించిన దర్శకుడు మరెవరు లేరు. ఒక మూవీ కోసం ఆయన చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఎంత కష్టం వచ్చినా సరే ఆ సినిమా మీద పెట్టిన ఫోకస్ అయితే ఎక్కడ మిస్ అవ్వదు. ప్రతి షాట్ లో తన మార్క్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు 12 సినిమాలను చేస్తే 12 సినిమాలు సూపర్ హిట్లుగా నిలిపాడు. అంటే అతనికి సినిమాల మీద ఉన్న డెడికేషన్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు…అందుకే రాజమౌళి లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. మహేష్ బాబు (Mahesh Babu) చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
Also Read : మహేష్ బాబు సినిమాకోసం రాజమౌళి మొదటి సారి ఇలా చేస్తున్నాడా..?
ఈ సినిమాతో ఎలాగైనా సరే పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే పాన్ వరల్డ్ లో స్టార్ డైరెక్టర్ గా ఉన్న జేమ్స్ కామెరూన్ లాంటి స్టార్ డైరెక్టర్ నుంచి ప్రశంసలను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ప్రపంచ ప్రేక్షకులను మెప్పిస్తుందా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులు రాజమౌళి ఇప్పటి వరకు చేసిన సినిమాలకు ఫిదా అయిపోయారు…
అలాగే బాహుబలి (Bahubali), ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాలతో ఇండియన్ సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. మరి ఇప్పుడు మహేష్ బాబు తో చేస్తున్న సినిమాతో ప్రపంచ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేయడానికి ఇందులో భారీ ఎలిమెంట్స్ పెట్టబోతున్నాడు. తద్వారా ఈ సినిమా మీద ఎలాంటి హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
అయితే రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు పక్కనే ఉంటూ మహేష్ బాబు చాలా క్లోజ్ ఫ్రెండ్ గా ఉండే వ్యక్తి మహేష్ ను మోసం చేస్తాడట. తనే వెన్నుపోటు పొడిచి మహేష్ దగ్గర ఉన్న సొమ్ము మొత్తాన్ని కాజేసే ప్రయత్నంలో తన ఫ్రెండ్ అయితే చాలా వరకు ప్లాన్స్ వేస్తూ బురిడీ కొట్టిస్తాడట… మరి ఈ సీన్లు సినిమాలో ఎలా చిత్రీకరించబోతున్నారు దాన్ని చూసిన తర్వాత ప్రేక్షకుడు ఎలా ఫీల్ అవుతాడు అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?