Rajamouli And Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక ఎప్పుడైతే ఆయన బాహుబలి సినిమా తీశాడో అప్పటినుంచి తనదైన రీతిలో సినిమాలను తీసి సక్సెస్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ స్టార్ డైరెక్టర్ తనను తాను మరొకసారి పాన్ వరల్డ్ లో నిరూపించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే 1200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుందంటూ ప్రేక్షకులందరు మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు. అయితే ఈ సినిమా దాదాపు 3000 కోట్ల వరకు కలెక్షన్స్ రావడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతుంది. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించి పాన్ వరల్డ్ లో రాజమౌళి టాప్ డైరెక్టర్ గా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు బాగానే ఉంది. అయితే 1200 కోట్ల బడ్జెట్ లో రాజమౌళి తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత అలాగే మహేష్ బాబు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంత అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.
ఇక వీళ్లిద్దరూ కలిసే దాదాపు 300 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక మహేష్ బాబు దాదాపు ఈ సినిమా మీద మూడు సంవత్సరాల సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది.
కాబట్టి అన్ని రోజులకు సరిపడా రెమ్యూనరేషన్ మొత్తాన్ని ఈ సినిమా మీదనే తీసుకుంటూ ముందుకు తీసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎప్పుడైతే రాజమౌళి తన దైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక రాజమౌళి చేస్తున్న ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ అవ్వాలని ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
ఇక మొత్తానికైతే తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళుతున్న రాజమౌళి గురించి మనం ఎంత మాట్లాడకున్న తక్కువే అవుతుంది. ఆయన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసి లొకేషన్స్ ను ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక తొందర్లోనే లొకేషన్స్ మొత్తాన్ని ఫైనల్ చేసి తొందర్లోనే సెట్స్ మీదకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు…