Mahesh babu and Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో సినిమా ఇటీవలే మొదలై ఒడిశా లో ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్ లో నెల రోజుల పాటు ఒక యాక్షన్ సన్నివేశాన్ని షూట్ చేయబోతున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ లతో పాటుగా 3 వేల మంది ఆర్టిస్టులు ఈ యాక్షన్ సన్నివేశం లో కనిపించబోతున్నారు. ఇండియన్ సిల్వర్ పైనే కాదు, ప్రపంచం లోనే ఎక్కడా చూడని విధంగా ఈ యాక్షన్ సన్నివేశం ఉంటుందని టాక్. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ రెండవ షెడ్యూల్ తర్వాత అత్యధిక శాతం విదేశాల్లో, అడవుల్లోని చిత్రీకతరించనున్నారు. కాబట్టి విదేశాల్లో ఎక్కువగా బైక్ మీద కానీ, కార్లో కానీ తిరగాల్సి ఉంటుంది.
Also Read : మహేష్ బాబు సినిమాకోసం రాజమౌళి మొదటి సారి ఇలా చేస్తున్నాడా..?
అందుకోసంగా రాజమౌళి నేడు ఖైరతాబాద్ RTO ఆఫీస్ కి వెళ్ళాడు. అక్కడ ఆయన తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ని రెన్యువల్ చేయించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సౌత్ ఆఫ్రికా తో పాటు, ఇతర ముఖ్యమైన దేశాల్లో ఉన్న దట్టమైన అడవుల్లో నెలల తరబడి షూటింగ్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు స్పెషల్ గా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు, అదే విధంగా అడవుల్లోని తండాల్లో నివసించే జనాల బాషాని కూడా ఆయన నేర్చుకున్నాడు. ఇది ఇండియన్ సినిమా అయితే కాదు, పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ గా చేసుకొని, అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్న సినిమా. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టేంత సత్తా ఉన్న సినిమా ఇది. #RRR తోనే హాలీవుడ్ డైరెక్టర్స్ ని ఆశ్చర్యపోయేలా చేసిన రాజమౌళి, ఈ చిత్రంతో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో డైనోసార్స్ ఉన్నాయి, వాటితో మహేష్ బాబు పోరాడుతాడు అంటూ లేటెస్ట్ గా వచ్చిన ఒక న్యూస్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ సినిమా అంటే కచ్చితంగా సింహాలు, పులులతో హీరో సావాసం చేస్తాడు అని మహేష్ అభిమానులు ముందుగానే ఫిక్స్ అయిపోయారు. కానీ అందరూ ఊహించినట్టు సినిమాలు తీస్తే అతను రాజమౌళి ఎందుకు అవుతాడు. అందుకే ఎవ్వరూ కలలో కూడా ఊహించని విధంగా డైనోసార్స్ ని కూడా ఈ సినిమాలోకి తీసుకొస్తున్నాడు. దీనిని బట్టీ ఈ సినిమా రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక నుండి జరగబోయే షెడ్యూల్స్ కి అసలు పెద్దగా గ్యాప్ ఉండదట. నాన్ స్టాప్ గా జరుగుతూనే ఉంటాయట. ఎట్టిపరిస్థితిలోను ఈ చిత్రాన్ని 2027 మార్చి నెలలో విడుదల చేయాలనీ టార్గెట్ పెట్టుకున్నాడు రాజమౌళి. మరి ఆ టార్గెట్ ని రీచ్ అవుతాడో లేదో చూడాలి.
Also Read : 3000 మందితో పడవలో మహేష్ బాబు పోరాటం..రాజమౌళి మార్క్ సన్నివేశం!
మహేష్ బాబు సినిమా కోసం ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లిన డైరెక్టర్ రాజమౌళి
అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లిన రాజమౌళి
మహేశ్ బాబు – రాజమౌళి సినిమాకు సంబంధించి విదేశాల్లో షూటింగ్ ఉన్న నేపథ్యంలో తన డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువల్… pic.twitter.com/I1eRqjFBiz
— Telugu Scribe (@TeluguScribe) April 24, 2025