Mahesh Babu – Rajamouli Movie Title : రాజమౌళి సినిమా అంటే ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏ హీరో అయినా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టాలంటే రాజమౌళితో సినిమా చెయ్యాల్సిందే. అలాంటి స్టాండర్డ్స్ ని సెట్ చేసాడు. ఇక మహేష్ బాబు బ్రాండ్ ఎలాంటిదో ఆయన గత చిత్రాల బాక్స్ ఆఫీస్ వసూళ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఫ్లాప్ టాక్ తో కూడా వంద కోట్ల రూపాయిల షేర్ ని అవలీలగా కొట్టగలిగే స్టామినా ఉన్న అతి తక్కువమంది హీరోలలో ఒకరు. అంతే కాకుండా మహేష్ బాబు కి రాజమౌళి కంటే ముందే పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన చేసిన సినిమాలు అలాంటివి. ముఖ్యంగా పోకిరి చిత్రాన్ని ప్రతీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు రీమేక్ చేసారు. ఆ సినిమా ద్వారానే ఆయన నేషనల్ లెవెల్ లో పాపులర్ అయ్యాడు.
అలాంటి ట్రేడ్ మార్క్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఈ ఇద్దరు కలిస్తే ఆ సునామీని ఊహించడం మన వల్ల సాధ్యం అవుతుందా..?, ఎప్పుడో పదేళ్ల క్రితమే ఈ సునామీ రావాల్సింది. కానీ ఎవరి కమిట్మెంట్స్ తో వారు బిజీ గా ఉండడం వల్ల ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ కుదిరింది. ఇప్పుడు రాబోతున్న సునామీ ఇంకా భయంకరమైనది, ఈ సునామీ దెబ్బకి హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కూడా షేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించుకోనుంది ఈ చిత్రం. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ చిత్రానికి టైటిల్ గా రాజమౌళి ‘గరుడ’ అని ఫిక్స్ చేసాడని, త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాడని అంటున్నారు. ‘గరుడ’ అనే సబ్జెక్ట్ రాజమౌళి డ్రీం. ఈ సినిమాని అత్యంత భారీగా తెరకెక్కించాలని అప్పట్లో అనుకున్నాడు. అయితే ఈ సినిమా సోలో హీరో సబ్జెక్ట్ కాదు. ఇది కూడా #RRR లాగానే మల్టీస్టార్రర్ చిత్రం. మరి ఇన్ని రోజులు మహేష్ – రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుంది అన్నారు కదా, కొత్తగా ఇదేంటి అని అనుకుంటున్నారు అభిమానులు.
అంటే ఆ కథని పూర్తిగా పక్కన పెట్టి, గరుడ అనే కొత్త సబ్జెక్ట్ చేయబోతున్నారా..?, ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ మీద రచయిత విజయేంద్ర ప్రసాద్ రాసిన స్క్రిప్ట్ రాజమౌళి కి నచ్చలేదా వంటి సందేహాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. దీనిపై మూవీ టీం క్లారిటీ ఇవ్వాల్సిందే. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ గత రెండు నెలల నుండి హైద్రాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించిన మహేష్ బాబు లుక్ కూడా బయటకి లీక్ అయ్యింది. ఒక వారియర్ లాగా ఆయన అభిమానులకు అనిపిస్తున్నాడు. ఒకవేళ ఈ సినిమా మల్టీస్టార్రర్ అయితే మరో హీరో గా ఎవరు నటించబోతున్నారు అనే అంశం పై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.