Bigg Boss  Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 నుండి తప్పుకోనున్న అక్కినేని నాగార్జున..? చివరి నిమిషంలో హోస్ట్ గా ఆ కుర్ర హీరో!

ఈ నెల 28,29 తేదీలలో కంటెస్టెంట్స్ కి సంబంధించిన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ షూటింగ్స్ కూడా చెయ్యబోతున్నారు. అంతా బాగానే ఉంది కానీ, సోషల్ మీడియా లో ఇప్పుడు వినిపిస్తున్న ఒక రూమర్ సంచలనంగా మారింది. అదేమిటంటే ఈ షో కి హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన ఈ షో నుండి తప్పుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Written By: Vicky, Updated On : August 25, 2024 6:16 pm

Bigg Boss Season 8 hosting

Follow us on

Bigg Boss  Telugu 8 : కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అన్ని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షో సెప్టెంబర్ 1వ తారీఖు నుండి స్టార్ మా ఛానల్ లో గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే విడుదల అయ్యాయి. సరికొత్త కాన్సెప్ట్ తో మరోసారి మన ముందుకు రాబోతుందని ఈ ప్రోమోలు చూస్తేనే అర్థం అవుతుంది. కంటెస్టెంట్స్ కి సంబంధించిన ప్రోమో షూటింగ్స్ కూడా గత వారం లోనే పూర్తి చేసారు. అలాగే ఈ నెల 28,29 తేదీలలో కంటెస్టెంట్స్ కి సంబంధించిన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ షూటింగ్స్ కూడా చెయ్యబోతున్నారు. అంతా బాగానే ఉంది కానీ, సోషల్ మీడియా లో ఇప్పుడు వినిపిస్తున్న ఒక రూమర్ సంచలనంగా మారింది. అదేమిటంటే ఈ షో కి హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన ఈ షో నుండి తప్పుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే ఇటీవలే హైదరాబాద్ లోని మాధాపూర్ లో ఉన్నటువంటి నాగార్జున కి సంబంధించిన ఆస్తి N కన్వెన్షన్ హాల్ ని తెలంగాణ ప్రభుత్వం అక్రమ కట్టడంగా పరిగణించి కూల్చేసిందని, దీని ప్రభావం వల్ల నాగార్జున ప్రస్తుతం హోస్ట్ గా వ్యవహరించే మూడ్ లో లేడని, ఆయన స్థానంలో దగ్గుబాటి రానా కొత్త హోస్ట్ గా రాబోతున్నాడు అంటూ రకరకాల కథనాలు ప్రచారం అయ్యాయి. అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని బిగ్ బాస్ టీం కి చెందిన సన్నిహిత వర్గాల నుండి సమాచారం వచ్చింది. నాగార్జున గారిపై రేపటి నుండే బిగ్ బాస్ సీజన్ 8 లాంచ్ ఎపిసోడ్ కి సంబంధించి షూటింగ్ మొదలు కాబోతుందని, సోషల్ మీడియా లో వస్తున్నా వార్తలు పూర్తిగా అవాస్తవం అని క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ రూమర్ పుట్టడానికి ప్రధాన కారణం బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ బాబు గోగినేని. ఈయన నిన్న తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్టు వేస్తూ ‘ అక్రమ కట్టడాల పై దారుణమైన ఆరోపణలు ఎదురుకుంటున్న తమ బిగ్ బాస్ షో హోస్ట్ అక్కినేని నాగార్జున ని షో నిర్వాహకులు తక్షణమే మార్చాలి. లేకపోతే హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ ఎలిమినేట్ చెయ్యాలి’ అంటూ ఫేస్ బుక్ లో ఒక ట్వీట్ వేసాడు.

దీనిని ఆ కోణం లో ఆలోచిస్తూ పలు యూట్యూబ్ చానెల్స్ నాగార్జున బిగ్ బాస్ షో నుండి తప్పుకుంటున్నట్టు కథనాలు ప్రచురించారు. ఇకపోతే ఈ సీజన్ ఈసారి 16 వారాల వరకు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. నిన్న మొన్నటి వరకు లాంచ్ ఎపిసోడ్ ద్వారానే 23 కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, కేవలం 17 మందిని మాత్రమే హౌస్ లోకి పంపిస్తారని. మిగిలిన వారిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పంపుతారని అంటున్నారు.