Mahesh Babu And Nagarjuna: సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. కాబట్టి ఏ ఇండస్ట్రీ నుంచి సినిమాలు వచ్చినా కూడా మిగతా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరు ఆ సినిమాలను చూసి ఇతర భాషల సినిమాలను సైతం ఎకరైజ్ చేస్తుండటం విశేషం… ఒకప్పుడు ఇతర భాషల్లో చేసిన సినిమాలను వేరే రాష్ట్రలో ఉన్న ప్రేక్షకులు చూసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు సినిమా అంతా ఒకటైపోవడం వల్ల అందరికి అన్ని సినిమాలు అందుబాటులో ఉంటున్నాయి. తద్వారా వాళ్లందరి సినిమాలను చూడడానికి అవకాశమైతే ఏర్పడింది… ఇక ప్రస్తుతం మన స్టార్ హీరోలు సైతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక తెలుగులో మంచి గుర్తింపు ను సంపాదించుకున్న నాగార్జున…
ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. తన వందో సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగుపెడుతున్నారు. అప్పట్లో ఆయన చేసిన ‘రక్షకుడు’ మూవీ ని పాన్ ఇండియా సినిమా గా చేసినప్పటికి అది ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు…అందుకే ఇప్పుడు మరోసారి పాన్ ఇండియాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక గతంలో నాగార్జున చేసిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలో మహేష్ బాబు ఒక క్యామియో రోల్ పోషిస్తానని నాగార్జున కి ముందుగా మాటిచ్చారట. కానీ ఆ మాటను మాత్రం నెరవేర్చుకోలేకపోయాడు. కారణమేంటి అంటే అప్పట్లో మహేష్ చాలా బిజీగా ఉండటం, అలాగే ఆ క్యామియో రోల్ పెద్దగా ఇంపాక్ట్ అనిపించకపోవడంతో దాన్ని రిజెక్ట్ చేశారట…దాంతో ఆ సినిమాలో ఒకసారి క్యామియో రోల్ లేకుండానే సినిమాని చేశారు. మొత్తానికైతే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయి నాగార్జునకి మొదటి 50 కోట్ల సినిమాగా నిలిచింది. ఇక ఇప్పటికి ఆయన డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.
అప్పట్లో కొత్త దర్శకుడు అయిన కళ్యాణ్ కృష్ణకి అవకాశం ఇచ్చిన నాగార్జున ఇప్పుడు మరి కొంతమంది కొత్త దర్శకులకు డైరెక్టర్లకు సైతం అవకాశాలను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాడు… తను చేస్తున్న ప్రయోగాలు, తను పరిచయం చేస్తున్న దర్శకులు సైతం నాగార్జునను టాప్ లెవల్ కి తీసుకెళ్లడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుండడం విశేషం…