Ibomma Immadi Ravi: ఐ బొమ్మ సైట్ ద్వారా భారీ ఎత్తున సినిమాలను పైరసీ చేస్తున్న ఇమ్మాడి రవి ని సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్న విషయం మనకు తెలిసిందే. తను ఎలా సినిమాలను హ్యాక్ చేసి పైరసీ చేసేవాడో చాలా క్లియర్ కట్ గా వివరించారు. ఇక ఏది ఏమైనా కూడా రవిని పట్టుకున్నాం కదా అని అందరం సంబరపడిపోతే ప్రయోజనం లేదు. హ్యాకింగ్ నేర్చుకున్న వాళ్ళు ఒక చాలామంది ఉన్నారు. కాబట్టి ఒక రవి పోతే ఇంకొక రవి పుట్టుకొస్తూనే ఉంటాడు. కాబట్టి మన కంటెంట్ ని మనం కాపాడుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని ఒక నిర్మాత సినిమాని చేస్తాడు. కొన్ని కోట్ల బడ్జెట్ ను పెట్టినప్పటికి సినిమా రిలీజ్ అయిన గంటలోపే పైరసీ అయిపోతోంది అంటే కారణం ఎవరు? చిన్న సినిమాలు పైరసీ చేస్తున్నారంటే ఒకే అనచ్చు. కానీ వందల కోట్ల మార్కెట్ ని కలిగి ఉన్న మన స్టార్ హీరోల సినిమాలు కూడా పైరసీ అవుతుండడం పట్ల చాలామంది చాలా రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా డిజిటల్ ప్లేయర్లకు ప్రొడ్యూసర్లు కోట్ల రూపాయలను చెల్లించి మరి పెట్టుకుంటున్నారు. కానీ వాళ్లు మాత్రం వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్లే హ్యాకర్లు మన ఐడి లను హ్యాక్ చేసి సినిమాలను పైరసీ చేస్తున్నారు. అందుకే మన సర్వర్ల నుంచి సినిమాని ఎదుటి వ్యక్తి హ్యాక్ చేయకుండా ఉండాలంటే డిజిటల్ ప్లేయర్లు వాళ్ళ పూర్తి బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరమైతే ఉంది.
వాళ్లు ఇలాగే ఉంటాం అంటే ఇంక చాలామంది రవి లు పుట్టుకొచ్చి సినిమాలను పైరసీ చేసే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎవరి బాధ్యతను వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఇకమీదట ఏ సినిమాలు పైరసీ కి గురవ్వవు…మొత్తానికైతే ఇమ్మాడి రవి నుంచి 3 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్టుగా సిపి సజ్జనార్ తెలియజేశాడు. అలాగే ఆయన ఇప్పటివరకు 20 కోట్ల రూపాయలను సంపాదించినట్టుగా కూడా రవి ఇన్వెస్టిగేషన్లో తెలియజేయడం విశేషం.
పోలీసులను ఉద్దేశిస్తూ మీరు ఎన్ని చేసిన నన్ను పట్టుకోలేరు అంటూ గతంలో పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన రవి ని హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇక తన దగ్గర 21 వేల పైరసీ సినిమాలు ఉండడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాబట్టి ఇప్పటికైనా కళ్లు తెరిచి డిజిటల్ ప్లేయర్లు వాళ్ళ బాధ్యతను పూర్తి స్పృహతో కొనసాగిస్తే మంచిది లేకపోతే మాత్రం ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు…