Mahesh Babu Marriage: సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక్కడ స్టార్ డమ్ అనేది ఎవ్వరికి సొంతం కాదు. ఒక్కరోజు ఒకరు టాప్ లో ఉంటే మరొకరోజు మరొక హీరో నెంబర్ వన్ పొజిషన్ కి వస్తాడు. ఇక్కడ సక్సెస్ లు మాత్రమే గుర్తుంటాయి. విజయం సాధించిన హీరోలకు మాత్రమే గౌరవం దక్కుతుంది. అందుకే ప్రస్తుతం మన స్టార్ హీరోలందరు భారీ సక్సెస్ ల మీద కన్నేస్తున్నారు… ఇక ఇలాంటి క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ప్రస్తుతం రాజమౌళితో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాలంటే మాత్రం మరికొద్దిగా వెయిట్ చేయాల్సిందే… మహేష్ బాబు తనతో పాటు వంశీ సినిమాలో నటించిన నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
Also Read: భారత్ వరకూ వచ్చిన యుద్ధం.. అమెరికా తెగించేసింది..
నమ్రత కంటే ముందే మహేష్ బాబు మరొక హీరోయిన్ ని ప్రేమించాడట. ఆమె ఎవరంటే ‘రాజకుమారుడు’ సినిమాలో తనతో పాటు కలిసిన నటించిన ప్రీతి జింత ని అతను ప్రేమించాడని తనని పెళ్లికూడా చేసుకుంటానని చెప్పినప్పటికి కృష్ణ మాత్రం వద్దని చెప్పడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట. అప్పుడేదో తెలిసి తెలియని వయసు లో ఆయన ఆమె ను ఇష్టపడ్డాడని చాలా మంది చెబుతుంటారు.
ఇక వంశీ సినిమాలో చేసిన నమ్రత ను మహేష్ ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. ప్రీతి జింత విషయంలో మాత్రం కృష్ణ ఎంత చెప్పిన వినకుండా ఇంట్లో నుంచి బయటికి వచ్చి మరి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కృష్ణ వాళ్ళ పెళ్లి ని స్వీకరించి వాళ్ళని ఇంటికి పిలిచి మరి రిసెప్షన్ పెట్టాడు. ఇక ఏది ఏమైనా కూడా సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్న మహేష్ బాబు ఘట్టమనేని ఫ్యామిలీ మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు.
ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని అలాగే ఘట్టమనేని ఫ్యామిలీ మీద అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే ఒకే ఒక హీరో కూడా తనే కావడం విశేషం. ఇక ఫ్యామిలీ నుంచి మరికొంతమంది హీరోలు వచ్చినప్పటికి వాళ్లెవరూ స్టార్ హీరోలుగా మారలేకపోతున్నారు… మహేష్ బాబు కొడుకు ఇండస్ట్రీకి వస్తే తను స్టార్ హీరోగా మారతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…