Mahesh Babu helped three directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలన్నీ యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించినవే కావడం విశేషం… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి భారీ విజయాలను కట్టబెట్టాయి… ఇక మహేష్ బాబు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్నప్పటికి ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో కూడా భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు… ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న వారణాసి సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. తను చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్యమైతే ఉంటుంది. ప్రస్తుతం రాజమౌళితో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబు, రాజమౌళి ఇద్దరు ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతుండటం విశేషం…మొత్తానికైతే ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. రాజమౌళి ఇంతకుముందు చేసిన సినిమాలు పాన్ ఇండియాకి మాత్రమే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోకి వెళ్తున్నాడు. మహేష్ బాబు తను చేసిన ఒక మంచి పని వల్ల ముగ్గురు దర్శకులు స్టార్ డైరెక్టర్ గా మారారనే విషయం మనలో చాలామందికి తెలియదు…కొత్త డైరెక్టర్లను, టాలెంట్ ఉన్న దర్శకులను ఎంకరేజ్ చేయడంలో అతను ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ‘కొత్త బంగారులోకం’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల కు ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేసే ఛాన్స్ ఇచ్చి తనను స్టార్ డైరెక్టర్ అయ్యేలా ప్రోత్సహించాడు.
ఇక సుకుమార్ సైతం మంచి సినిమాలు చేస్తాడనా టాక్ ఉన్నప్పటికి అతను చేసేంతవరకు ఏ ఒక్క స్టార్ హీరోతో కూడా సినిమా చేయలేదు. అయితే అల్లు అర్జున్ తో సినిమా చేసినప్పటికి అతన్ని స్టార్ హీరో చేసిన దర్శకుడు కూడా సుకుమారే కావడం విశేషం…ఇక సుకుమార్ ఎప్పుడైతే మహేష్ బాబుతో సినిమా చేసాడో అప్పటినుంచి హిట్స్, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు…
వన్ నేనొక్కడినే సినిమాకి ముందు సుకుమార్ కొంతమంది స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ట్రై చేసిన కూడా అది వర్కౌట్ కాలేదు. ఎందుకంటే సుకుమార్ డిఫరెంట్ సబ్జెక్టులతో సినిమాలను చేస్తాడనే పేరు ఉండేది. స్టార్ హీరో ఇమేజ్ ను మ్యాచ్ చేయగలడా లేదా అనే ఉద్దేశ్యంతో చాలామంది అతన్ని రిజెక్ట్ చేశారు. కానీ మహేష్ బాబు మాత్రం నమ్మాడు అయిన కూడా వన్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.
కానీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది… ఇక పరశురాం లాంటి దర్శకుడితో సైతం ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేశాడు. నిజానికి అప్పటివరకు ఏ ఒక్క స్టార్ హీరోతో సినిమా చేయలేదు…కానీ అలాంటి దర్శకుడిని సైతం నమ్మి అతనితో సినిమా చేశాడు అది యావరేజ్ గా ఆడింది…