Chiranjeevi workout video : ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్’ అన ది ప్రతీ ఒక్కరికి వర్తించదు , కేవలం కొంతమందికి మాత్రమే వరిస్తుంది , ఆ కొంతమంది లో ఒకరు మెగాస్టార్ చిరంజీవి. 70 ఏళ్ళ వయస్సు వచ్చింది , ఇప్పటికీ ఆయన డ్యాన్స్ లో వేగం తగ్గలేదు , మాటల్లో పదును తగ్గలేదు, అందం అంతకంటే తగ్గలేదు. ఈ వయస్సులో కూడా నిరంతరం కష్టపడుతూ నేటి తరం యువత కి ఆదర్శంగా నిలుస్తున్నాడు మెగాస్టార్. కాసేపు జాగింగ్ చెయ్యాలన్నా, వాకింగ్ చెయ్యాలన్నా బద్ధకం చూపించే యువత ఉన్న ఈ కాలం లో , 70 ఏళ్ళ వయస్సులో , అన్ని రకాల వర్కౌట్స్ చేస్తూ, తనకు తానే సాటి, ఎవ్వరూ లేరు పోటీ అని అనిపిస్తున్నాడు మెగాస్టార్. ప్రతీ సినిమాకు ప్రారంభానికి ముందు , తన బాడీ ఫిట్నెస్ మీద మెగాస్టార్ పెట్టేంత శ్రద్ద ఇండస్ట్రీ లో ఏ హీరో కూడా పెట్టాడేమో అనిపిస్తుంది.
త్వరలోనే ఆయన డైరెక్టర్ బాబీ తో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం తేదీ ఫిక్స్ అయ్యింది. దీంతో మెగాస్టార్ తనని తానూ సిద్ధం చేసుకోవడం కోసం , జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కనిపించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. నేటి తరం కుర్ర హీరోలు ఎలా అయితే జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నారో , వాళ్ళతో సమానంగా మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఈ వర్కౌట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది. రకరకాల రోగాలతో హాస్పిటల్స్ చుట్టూ తిరిగే వయస్సు లో కూడా ఇదేమి ఎనర్జీ బాసూ , నీకు మా సెల్యూట్ అంటూ సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక లేటెస్ట్ మూవీ విషయానికి వస్తే , బాబీ దర్శకత్వం లో తెరకెక్కబోయే ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే మైల్ స్టోన్ లాగా నిలబడబోతుంది. KVN ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించబోతోంది. ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి కి కూతురు గా అనశ్వర రాజన్ నటిస్తుండగా , మెగాస్టార్ కి జోడీగా ప్రియమణి నటించబోతుంది. అనురాగ్ కశ్యప్ విలన్ గా నటిస్తుండగా , మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Age is just a number when we love and respect the work we do!! pic.twitter.com/cbrwJLzyCo
— Aakashavaani (@TheAakashavaani) May 17, 2026