Mahesh Babu and NTR : సూపర్ స్టార్ కృష్ణ (Krishna) నటవారసుడిగా కి ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు (మహేష్ Babu) రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వంలో రాజకుమారుడు (Rajakumarudu) అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికి దక్కనటువంటి అరుదైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన్ వరల్డ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనని తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక నందమూరి ఫ్యామిలీ మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం మంచి సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు.
Also Read : ఎన్టీఆర్ కి ఏమైంది..? ఎందుకిలా అయిపోయాడు..అవేమి లుక్స్ బాబోయ్ అంటున్న నెటిజెన్స్!
తన తోటి హీరోలందరు పాన్ ఇండియాలో మంచి సక్సెస్ లను సాధిస్తుంటే ఆయన కూడా ఎలాగైనా సరే ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలు చేయాలనే లక్ష్యంతో ఉన్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబుల మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధమైతే ఉంది. ఎన్టీఆర్ మహేష్ బాబు ని అన్న అంటూ పిలుస్తాడు. ఎవరి ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా వీళ్ళిద్దరూ అటెండ్ అవుతూ వీళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ను తెలియజేస్తూ ఉంటారు.
మరి వీళ్ళిద్దరూ ఒక సినిమా చేస్తే చూడాలని అటు ఘట్టమనేని ఫ్యామిలీ, ఇటు నందమూరి ఫ్యామిలీ అభిమానులు సైతం ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటి వరకు అది అయితే కార్యరూపం దాల్చలేదు. మరి ఇకమీదట వీళ్ళ కాంబినేషన్ లో ఏదైనా సినిమా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధిస్తుందేమో చూడాలి. మహేష్ బాబు సినిమా చేసిన సినిమాల్లో ఎన్టీఆర్ కి ఒక రెండు సినిమాలంటే అస్సలు నచ్చవట.
అందులో ఒకటి బాబి సినిమా కాగా, మరొకటి బ్రహ్మోత్సవం సినిమా కావడం విశేషం…మిగతా సినిమాలెవీ చూసినా కూడా ఎన్టీఆర్ కి అంతగా బోర్ అయితే కొట్టలేదట. కానీ ఈ రెండు సినిమాలు మాత్రం చూస్తున్నంత సేపు ఎందుకు చూస్తున్నామా అనే అంతలా బోర్ కలిగించాయంటూ ఆయన ఒకానొక సందర్భంలో తెలియజేయడం విశేషం…ఇక ఈ సినిమాలు మహేష్ బాబు కి కూడా నచ్చలేదట.
Also Read : జూనియర్ ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీ టైటిల్ తో మహేష్ బాబు, రాజమౌళి సినిమా తెరకెక్కుతుందా..? ఇదేమి ట్విస్ట్ సామీ!