Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు… ఆయన చేసిన సినిమాలన్ని గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి… ఇక ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్న మహేష్ బాబు ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనే దానిమీద సర్వత్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాని సుకుమార్ డైరెక్షన్లో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే సుకుమార్ తను రాసుకున్న కథను మహేష్ బాబు నమ్రతలకు వినిపించారట. ఆ కథ వాళ్ళిద్దరికి బాగా నచ్చడంతో ఆ సినిమా చేయడానికి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
Also Read: ఈ లోపాలు అధిగమిస్తేనే.. “రాయ్ పూర్” సొంతమయ్యేది!
ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకులలో సుకుమార్ కూడా ఒకరిగా నిలవడం విశేషం… పుష్ప 2 సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన మహేష్ బాబుతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇక మహేష్ బాబు సైతం రాజమౌళి సినిమాని పూర్తి చేసి చాలా ఫ్రెష్ గా సుకుమార్ తో సినిమా స్టార్ట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక రాజమౌళితో చేస్తున్న సినిమా పాన్ వరల్డ్ లో రిలీజ్ అవ్వబోతోంది. కాబట్టి ఈ సినిమాకి గొప్ప గుర్తింపైతే వస్తుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.
ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చే సినిమా కూడా పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కాలి. అందుకోసమే సుకుమార్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల చేత శభాష్ అనిపించేలా ఒక కథను రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళిద్దరికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…