IAS Daughter Case: ఏపీలో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న చిన్న రాముడు కుమార్తె మాధురి సాహితీ బాయి(25) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన తర్వాత చిన్న రాముడు విలేకరులతో సంచలన విషయాలను వెల్లడించారు. తన కుమార్తె మరణానికి ఆమె భర్త రాజేష్ నాయుడు కారణమని ఆరోపించారు. అతడి వేధింపుల వల్ల తన కుమార్తె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని కన్నీటి పర్యంతమయ్యారు. తన భార్య ద్వారా రాజేష్ నాయుడు మీద కేసు కూడా పెట్టించారు.
Also Read: ఈ లోపాలు అధిగమిస్తేనే.. “రాయ్ పూర్” సొంతమయ్యేది!
చిన్న రాముడు మాట్లాడిన మాటలతో అన్ని వేళ్ళు కూడా రాజేష్ నాయుడి వైపు చూపించాయి. అయితే ఇప్పుడు ఈ ఘటనలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. సాహితీ బాయి ఆత్మహత్య ఘటనపై తనకు అనేక అనుమానాలు ఉన్నాయని రాజేష్ నాయుడు ఆరోపించారు.. “మమ్మల్ని విడదీశారు. ఆమె తల్లిదండ్రులు సెప్టెంబర్ లోనే తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె వారింట్లోనే ఉంటుంది. అలాంటప్పుడు నావల్ల ఆమె ఎలా ఆత్మహత్య చేసుకుంటుందని” రాజేష్ నాయుడు చెప్పినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మాధురి తనకు పెట్టిన సందేశాలు కూడా ఉన్నాయని.. వాటిని పరిశీలిస్తే పుట్టింటి వారిపైన అనుమానం కలుగుతోందని రాజేష్ నాయుడు ఆరోపించారు. రాజేష్ నాయుడు కు మాధురి పంపించినట్టుగా ఉన్న కొన్ని సందేశాలు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్కులేట్ అవుతున్నాయి.. అంతేకాదు పుట్టింటి వారి మాట వినలేదని మాధురికి గుండు కొట్టించారని.. మార్చి 5న మహానంది ఆలయంలో పెళ్లి చేసుకుంటే.. తమను నంద్యాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చారని.. అక్కడికి చిన్న రాముడు దంపతులు వస్తే.. తనతోనే ఉంటానని మాధురి చెప్పిందని.. దీంతో వారు మాధురి ఒంటి మీద ఉన్న నగలు తీసుకెళ్లారని రాజేష్ నాయుడు ఆరోపించాడు. అంతేకాదు ఆమె గర్భవతి అయితే.. బలవంతంగా గర్భ స్రావం చేయించారని రాజేష్ నాయుడు ఆరోపించారు.
మాధురి అంత్యక్రియలు స్వగ్రామమైన బేతంచెర్ల మండలం బుగ్గాని పల్లి తండాలో మంగళవారం జరిగాయి.. ఉద్రిక్తత చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మాధురి మృతదేహానికి ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్ జవహర్ నివాళులర్పించారు. చిన్న రాముడు ఆరోపణలతో మాధురి ఘటన ఏపీ ప్రజలకు తెలిసింది. ఇప్పుడు రాజేష్ నాయుడు స్వరం వినిపించడంతో ఈ కేసు మలుపు తిరిగింది.