Telangana Politics: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్. తెలంగాణ సమాజాన్ని కించపరిచారని చెబుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్నారు. అయితే ఆయన అన్నది ఏంటి? వీరు అంటున్నదేంటి? అనేది పక్కన పెడితే.. ఏదో ఆశించి వారు అలా మాట్లాడుతున్నారని అర్థమవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండేళ్ల సుపరిపాలన పై వేడుకలు చేసుకుంటున్నారు. భారీగా పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వ పాజిటివ్ని పక్కదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పాలకులపై కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రధానంగా బిఆర్ఎస్ ట్రాప్ లో కాంగ్రెస్ పడినట్లు స్పష్టం అవుతుంది. కెసిఆర్ పార్టీకి ఊపిరి పోసేందుకే పవన్ పై విమర్శలు చేస్తున్నారా? అని విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
Also Read: ఈ లోపాలు అధిగమిస్తేనే.. “రాయ్ పూర్” సొంతమయ్యేది!
* కోమటిరెడ్డి బ్రదర్స్ పై భిన్నాభిప్రాయాలు..
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Venkat Reddy ) పై ఒకరకమైన అభిప్రాయం ఉంది. ఎప్పటికీ ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నారు. వెంకట్ రెడ్డి వద్ద ప్రస్తుతం సినిమాటోగ్రఫీ శాఖ ఉంది. బహుశా ఆ ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ సినిమా ఆడనివ్వనని తేల్చి చెబుతున్నారు. అయితే అది అహంకారం కిందకే వస్తుంది. ఎందుకంటే ఏ సినిమాను కూడా ఆపే అధికారం ప్రభుత్వానికి ఉండదు. కానీ అనాలోచిత మాటలతో వెంకట్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే ఆపు చూద్దాం అంటూ.. సినిమా డైలాగులు చెప్పడం కాదు అంటూ బిఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి సవాల్ చేస్తుండడం అర్థం చేసుకోవాల్సిన విషయం. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి దాని ఫలితాలను రాబెట్టాలన్నది అక్కడ పార్టీల వ్యూహంగా తెలుస్తోంది. అయితే పవన్ వ్యాఖ్యలు సెంటిమెంట్ కు కారణం అయితే మాత్రం లబ్ది పొందేది కేసీఆర్ పార్టీ. ఎందుకంటే అక్కడ ముందుగా ఈ అంశం గురించి మాట్లాడింది ఆ పార్టీ నేతలే. వారి తరువాత కాంగ్రెస్ నేతలు మాట్లాడారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పైగా ఒక మంత్రిగా ఉంటూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బాధ్యతగా వ్యవహరించాలి కానీ.. ఎందుకు ఆయన తన స్థాయికి తగ్గట్టు ఆలోచన చేయలేదని అనిపిస్తోంది.
* క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్..
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ( Congress Party) పరిస్థితి భిన్నంగా ఉంది. తెలంగాణలో అలానే నిలదొక్కుకోవాలంటే గత రెండేళ్లలో చేసిన అభివృద్ధిని చెప్పుకుంటే మంచిది. లేకుంటే కెసిఆర్ పార్టీ వైఫల్యాలను చెప్పుకుంటే మంచిది. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తామంటే పవన్కుమించి ఎన్నో రకాల అంశాలు ఉన్నాయి. వాటి గురించి చెప్పుకోవాలి కానీ.. అనవసరంగా పవన్ కళ్యాణ్ జోలికి వచ్చి రాజకీయంగా లబ్ధి పొందుతామంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. పైగా పవన్ వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు కూడా తేలిగ్గా తీసుకున్నారు. పైగా ఏపీలో ఏ ఎన్నికలు కూడా లేవు. ఆపై పవన్ ఎలా మాట్లాడుతారో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఏదైనా అడ్డదిడ్డంగా మాట్లాడి రాజకీయాల కోసం పాకులాడే మనసు పవన్ ది కాదు. ఒకవేళ రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేకపోతే మాత్రం ఇలాంటి బలహీన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాలి. అంతే తప్పించి డైవర్షన్ పాలిటిక్స్ తో రాజకీయం చేస్తామంటే కుదరదు.
* ఆ మాట చెప్పుకుంటే మంచిది..
రేవంత్ సర్కారు వచ్చి రెండేళ్లు అవుతోంది. ఈ మాట అన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు మింగుడు పడదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ తప్ప.. ఇది రేవంత్ సర్కార్ కాదన్నది అక్కడి నేతల అభిప్రాయం. అయితే కాంగ్రెస్ నేతలు తెలిసి చేస్తున్నారో.. తెలియక చేస్తున్నారో తెలియడం లేదు గాని.. తాము ఈ రెండేళ్లలో అభివృద్ధి చేశామని చెబితే పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తారు. కాదు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులపై విమర్శలు చేసి బయటపడతామంటే కుదరని పని. అది అంతిమంగా ఆ పార్టీకే నష్టం.