Mahesh Babu Namrata Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు…ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపు సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకునేలా చేశాడు… మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ఆయన ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నంలో మహేష్ బాబు ఉన్నట్టుగా తెలుస్తోంది… రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా చాలా మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ని ప్రేక్షకులకు అందించాలని రాజమౌళి ప్రయత్నం చేస్తున్నప్పటికి సినిమా హైప్ దృష్ట్యా ఈ మూవీ అప్డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేయాలో అప్పుడు మాత్రమే చేస్తానని చెబుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా చేయడానికి నమ్రతానే కారణమని చెప్పొచ్చు. ఎందుకంటే మహేష్ బాబు ఏ సినిమాలు చేయాలి? ఎలాంటి సినిమాలు చేయాలి అనేది మొత్తంనమ్రత నే చూసుకుంటారు. ఇక వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు… 2005వ సంవత్సరంలో ఇద్దరూ ప్రేమించుకున్న ఉన్న విషయాన్ని మహేష్ బాబు కృష్ణతో చెప్పాడు. అయినప్పటికి కృష్ణ మాత్రం వాళ్ల ప్రేమను ఒప్పుకోలేదట. దాంతో వీళ్ళిద్దరూ బయటికి వచ్చి పెళ్లి చేసుకున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ విషయంలో సుజీత్ ఆ ఒక్క తప్పు చేశాడా..?
ఆ తర్వాత కృష్ణ మళ్ళీ వాళ్లను ఇంటికి పిలిపించి తన ఆధీనంలో మరోసారి పెళ్లి చేశాడు. మొత్తానికైతే మహేష్ బాబు నమ్రతాలు ప్రేమించుకున్నప్పుడు కావాలనే కొంతమంది మహేష్ బాబు సన్నిహితులు మహేష్ బాబు ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నాడని చెప్పారట. దానికి మనం యాక్సెప్ట్ చేయొద్దని కృష్ణకి బ్రెయిన్ వాష్ అయితే చేశారట.
వాళ్లే తమ లవ్ స్టోరీ కి విలన్స్ అని గతంలో నమ్రత ఒకసారి తమ లవ్ స్టోరీ చెబుతూ కృష్ణ గారి మైండ్ సెట్ ని మార్చాలని కూడా చూశారని చెప్పారు. మరి మొత్తానికైతే విత్ ఇన్ షార్ట్ టైంలోనే కృష్ణ వాళ్ళని యాక్సెప్ట్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…
ఇక ప్రస్తుతం మహేష్ బాబు చేసే ప్రతి సినిమా స్టోరీ సెలక్షన్ ని తనే చూసుకుంటుంది అంటే ఆమె ఎంత పర్ఫెక్షన్ తో ముందుకు దూసుకెళ్తుందో మనం అర్థం చేసుకోవాలి.అలాగే బిజినెస్ కు సంబంధించిన విషయాలను కూడా నమ్రతనే చూసుకుంటారు. మహేష్ బాబు చాలా ఫ్రీగా తన సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు…