spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Namrata first gift: మహేష్ బాబు కి నమ్రత ఇచ్చిన మొదటి గిఫ్ట్...

Mahesh Babu Namrata first gift: మహేష్ బాబు కి నమ్రత ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఇదే…

Mahesh Babu Namrata first gift: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే టాప్ హీరోగా మారాడు. ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకోవడానికి దోహదపడ్డాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం మహేష్ బాబు పాన్ ఇండియాలోని ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. వారణాసి సినిమాతో హాలీవుడ్ ఇండస్ట్రీ ని సైతం తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన విపరీతంగా కష్టపడుతున్నాడు. ఇక మహేష్ బాబు భార్య అయిన నమ్రత సైతం ఎలాంటి సినిమాలు చేయాలి. అతని ఇమేజ్ కి ఎలాంటి కథలైతే సరిపోతాయి. అనే విషయంలో చాలా కేర్ గో గా వ్యవహరిస్తుంది. ఇక మహేష్ బాబు నమ్రత ఇద్దరు వంశీ సినిమాలో కలిసి నటించారు. అప్పుడే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వీళ్లిద్దరు పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. మొత్తానికైతే మహేష్ బాబు నమ్రత కు ఇచ్చిన మొదటి గిఫ్ట్ ను ఇప్పటివరకు తను దాచుకుందట. వాళ్ల పెళ్లై 20 సంవత్సరాల పైన అవుతుంది…

ఇంతకీ ఆయన మొదటి గిఫ్ట్ గా ఏమిచ్చాడు అంటే ఒక వాచ్ అయితే ఇచ్చాడట. దానికి సంబంధించి ఆమె ఇప్పటికి అలాగే భద్రపరుచుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే మహేష్ బాబు ని అమితంగా ఇష్టపడిన నమ్రత తన కోసం సినిమాలను చేయడం సైతం మానేసి ఫ్యామిలీని చూసుకుంటుంది.

Also Read: ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో తన వైఫ్ లక్ష్మి ప్రణీతికి నచ్చిన సినిమాలు ఇవే…

అలాగే మహేష్ బాబు చేసే సినిమాల విషయంలో తనకు తగిన సలహాలు సూచనలను ఇస్తూ తనను ముందుకు తీసుకెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది…ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం మహేష్ బాబు పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తుండడం అతని ఫ్యామిలీతో పాటు అతని అభిమానులకు కూడా ఆనందాన్ని కలిగింపజేస్తుందనే చెప్పాలి. మరి ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నాడనే విషయం మీద ఇంకా సరైన క్లారిటి రావడం లేదు.

మొత్తానికైతే పలువురు దర్శకుల నుంచి కథలను వింటున్నప్పటికి ఇంకా ఏ కథను కూడా ఫైనల్ చేయలేదు. కారణం ఏంటి అంటే వారణాసి ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందో చూసి తర్వాత సినిమాను సైతం అంతకు మించిన సక్సెస్ ని సంపాదించి పెట్టగలిగే దర్శకుడు అయితేనే బాగుంటుందని ఇప్పటి వరకు ఎలాంటి కథను ఫైనల్ చేయలేదట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version