Jr NTR wife favorite films: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధించడం అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. దానికోసం ఎన్నో సంవత్సరాల పాటు నిరీక్షించాల్సిన అవసరమైతే ఉంటుంది. గొప్ప కథలను సెలెక్ట్ చేసుకుని దాన్ని అంతకు మించిన ప్రజెంటేషన్ చేసినప్పుడే ఆ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. ఇక ఈ మధ్యకాలంలో విజువల్ వండర్స్ కి ఎక్కువ ఆదరణ దక్కుతుంది. జూనియర్ ఎన్టీఆర్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో మొదటి సక్స్ ను తన ఖాతాలో వేసుకున్న ఆయన ఆ తర్వాత చేసిన ఆది, సింహాద్రి లాంటి సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ సక్సెస్ లను సాధించాడు.
ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నాడు. పాన్ ఇండియాలో ఆయనకి ఇప్పటివరకు సరైన మార్కెట్ క్రియేట్ అవ్వలేదు. కారణం ఏదైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకున్నప్పుడు మాత్రమే ఆయన టాప్ లెవల్లో ముందుకు దూసుకెళ్లడానికి అవకాశమైతే ఉంటుంది.
Also Read: ‘బైకర్’ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఊహించిన దానికంటే ఎక్కువే వచ్చిందిగా..
ఇక తన భార్య అయిన లక్ష్మీ ప్రణతి కి ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో టెంప్ట్ సినిమా అంటే చాలా ఇష్టమట…ఎందుకంటే ఆ సినిమా ఒక అమ్మాయికి న్యాయం చేయడానికి ఉంటుంది. కాబట్టి తనకు ఆ సినిమా అంటే చాలా ఇష్టమట. ఇక అందులో ఎన్టీఆర్ యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఆమె గతంలో చెప్పింది. ఇక వీటితోపాటుగా అప్పటివరకు ఎన్టీఆర్ వరుస ప్లాపుల్లో ఉన్నాడు.
టెంపర్ సినిమా తోనే అతనికి మరోసారి భారీ సక్సెస్ దక్కిందని అందువల్లే ఆ సినిమా ఏ రకంగా చూసుకున్న అద్భుతంగా ఉంటుందని తనకు బాగా నచ్చిన సినిమా అదేనని ఆమె చెబుతుంది…ఇక ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాతో నెక్స్ట్ లెవల్లో సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు… ఈ మూవీ ఈ సంవత్సరం చివర్లో కానీ, లేదంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో కానీ రిలీజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి…
