Mokshagna debut movie story: ఇండస్ట్రీ లో వారసత్వం ఉన్నంత మాత్రాన సక్సెస్ లు వస్తాయనే గ్యారంటీ లేదు. నిరంతరం కష్టపడి గొప్ప విజయాలను సాధించిన వాళ్లకు మాత్రమే ఇక్కడ భారీ ఇమేజ్ దక్కుతుంది. వారసత్వంగా వచ్చిన హీరోలకి అవకాశాలు వస్తాయి. కానీ సక్సెస్ రావడం అనేది అంత ఈజీ కాదు. ఎవరి టాలెంట్ ని వాళ్ళు ప్రూవ్ చేసుకొని సక్సెస్ సాధించిన వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు నిలబడగలుగుతారు. లేకపోతే మాత్రం చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు… నందమూరి ఫ్యామిలీకి ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉంది. బాలకృష్ణ మాస్ లో తన స్టామినా ఏంటో చూపించాడు. ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రతి ప్రేక్షకుడిని విశేషంగా అలరిస్తున్నాయి.
ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మోక్షజ్ఞ సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడు. గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఆయన ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలామంది నందమూరి అభిమానులతో పాటు టిడిపి కార్యకర్తలు సైతం ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: మహేష్ బాబు కి నమ్రత ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఇదే…
కానీ ఎప్పటికప్పుడు తన సినిమా పోస్ట్ పోన్ అవుతు వస్తుంది. ఇక ప్రస్తుతం మోక్షజ్ఞ సినిమా కథకు సంబంధించిన పనులను చూసుకోవడానికి ఒక యంగ్ హీరోని అప్పజెప్పినట్టుగా తెలుస్తుంది. ఇంతకీ అతను ఎవరు అంటే సిద్దు జొన్నలగడ్డ గా తెలుస్తుంది. బాలయ్య బాబుకు సిద్దు జొన్నల గడ్డ కి మధ్య సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి.
సిద్ధు స్వతహాగా రైటర్ కావడం వల్ల మోక్షజ్ఞ కి ఒక యంగ్ డైరెక్టర్ కథనైతే వినిపించారట. ఇక ఆ కథ ఎలా ఉంది దాన్ని జడ్జ్ చేసి అందులో మార్పులు చేర్పులు చేసే బాధ్యతను బాలయ్య సిద్దుకి అప్పజెప్పాడట. ఈ విషయంలో సిద్దు సైతం చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే మోక్షజ్ఞ ఈ సంవత్సరం తన సినిమాని స్టార్ట్ చేసి వచ్చే సంవత్సరం రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…
