Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక హీరోలు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ సాధిస్తారు. తద్వారా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటుడు మహేష్ బాబు (Mahesh Babu)…ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టింది. మరి ఇలాంటి సందర్భంలోనే తన దైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని తన వైపు తిప్పుకున్నాడు. ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు (Mahesh Babu) రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో చేస్తున్న సినిమా విషయంలో ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం రాజమౌళి ఏది చెబితే అది చేస్తూ ఎలాంటి రిస్క్ అయినా సరే చేయడానికి మహేష్ బాబు సిద్ధమై ముందుకు సాగుతున్నాడు. దీనివల్ల ప్రపంచంలోనే స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read : మహేష్ బాబు సినిమాకోసం రాజమౌళి మొదటి సారి ఇలా చేస్తున్నాడా..?
అయితే కొంతమంది దర్శకులు మహేష్ బాబుకి కథలను చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మహేష్ బాబుకి కథ చెప్పాలి అంటే ముందు అతని మేనేజర్ కి కథ చెప్పాలి, ఆ తర్వాత మహేష్ వైఫ్ అయిన నమ్రతకి కథ చెప్పాలి.
వాళ్ళిద్దరికీ కథ నచ్చితే అప్పుడు మహేష్ బాబుకి కథ చెప్పాల్సి ఉంటుంది. ఒక రకంగా మహేష్ బాబుకి కథ చెప్పాలంటే ఇంత ప్రాసెస్ అనేది నడుస్తుంది. అందుకే మహేష్ బాబు కెరియర్ లో చాలావరకు సక్సెస్ లే ఉంటాయి తప్ప ఫెయిల్యూర్స్ అయితే ఉండబోవు. ఒకటికి రెండుసార్లు నమ్రత మహేష్ బాబుకు సలహాలను ఇస్తూ ఉంటుంది కథలో ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా తనే డైరెక్టర్ తో కోలాబరేట్ అయి చెబుతూ ఆ మార్పులు చేర్పులను చేయిస్తోంది.
తద్వారా ఆయనకు బౌండెడ్ స్క్రిప్టు తన దగ్గరికి వస్తుంది. అందువల్లే ఆయన చాలా కంఫర్ట్ గా సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. మహేష్ బాబు వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీ లో మంచి సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఇక మీదట ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది.
Also Read : 3000 మందితో పడవలో మహేష్ బాబు పోరాటం..రాజమౌళి మార్క్ సన్నివేశం!