Balayya : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి బాలయ్య బాబుకి చాలా మంచి క్రేజ్ అయితే ఉంటుంది. మాస్ సినిమాలు చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన నుంచి వచ్చే ప్రతి డైలాగు ప్రేక్షకులందరిని అలరిస్తుంది. ఆయన చేసే ఫైట్ సీక్వెన్సెస్ లు కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా సంపాదించి పెడుతుంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన లాంటి హీరో ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాలతో కూడా ప్రేక్షకుల్లో ఒక జోష్ నింపాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే బాలయ్య బాబు సినిమాలపరంగా చాలా మంచి మనిషి అలాగే చాలా గొప్ప సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో అభిమానాన్ని అందుకుంటున్నాడు. కానీ బాలయ్య బాబు మీద ప్రముఖ దర్శకుడు అయిన గీతాకృష్ణ (Geetha Krishna) కొన్ని కామెంట్లైతే చేశాడు.
Also Read : బాలయ్య ఫ్యాన్స్ కి పండగే..’డాకు మహారాజ్’ ఓటీటీ వెర్షన్ లో 15 నిమిషాల సరికొత్త సన్నివేశాలు!
బాలయ్య బాబు ఒక సైకో అని షూటింగ్ స్పాట్ లో తనను చూసి నవ్వినవారిని తన రూమ్ లోకి పిలుచుకొని మరి కొడతాడని చెప్పాడు. అలాగే తను కె విశ్వనాథ్ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కి వర్క్ చేస్తున్నప్పుడు కె.విశ్వనాథ్ బాలయ్య బాబుతో చేసిన ‘జనని జన్మభూమి’ అనే సినిమా సమయంలో బాలయ్య తనతో చాలా మంచి సన్నిహిత్యంగా ఉండేవాడని తెలియజేశాడు.
అలాగే ఇప్పుడు బాలయ్య బాబు మెంటాలిటీ వేరే విధంగా ఉందని ఆయన ఒక సైకోల బిహేవ్ చేస్తున్నాడు అంటూ గీత కృష్ణ మాట్లాడిన మాటలు సగటు ప్రేక్షకులతో పాటు బాలయ్య అభిమానులను కూడా భారీగా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా నటుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన బాలయ్య బాబు కొన్ని విమర్శలను కూడా ఎదుర్కోవడం దురదృష్టకరమైన విషయమనే చెప్పాలి.
మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట బాలయ్య బాబు మంచి సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు. బాలయ్యను డైరెక్టర్స్ హీరో అని కూడా అంటారు ఎందుకంటే డైరెక్టర్లు ఏం చెబితే అది బ్లైండ్ గా ఫాలో అవుతూ ఉంటాడు. కాబట్టి అతనితో సినిమా చేయడం చాలా కంఫర్ట్ అని చాలా మంది స్టార్ డైరెక్టర్లు చెబుతూ ఉంటారు.