Mahesh Babu and Sukumar : సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొక చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఇండస్ట్రీలో చాలా వరకు మనం ఇలాంటి విషయాలను చూస్తూనే ఉంటాం… నిజానికి స్టోరీ విన్నప్పుడే హీరోలు ఆ సినిమా రిజల్ట్ ను అంచనా వేయాలి… ఎందుకంటే సక్సెస్ అయ్యే సినిమా ఏంటి ప్లాప్ అయ్యే సినిమా ఏంటి అనేది సరిగ్గా అంచనా వేయగలగాలి. లేకపోతే మాత్రం వాళ్ళ కెరియర్ కి చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలైతే ఉంటాయి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్ (Sukumar)… ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఆయన చేస్తున్న ప్రతి క్యారెక్టర్ కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ లో ప్రవర్తిస్తూ ఉంటారు. సుకుమార్ సమాజాన్ని బాగా చదివిన వ్యక్తి కాబట్టి ఆ క్యారెక్టరైజేశన్ రిఫరెన్స్ ని చాలా బాగా రాసుకుంటూ సినిమాని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒకెత్తైతే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక మొత్తానికైతే పుష్ప 2(Pushpa 2) సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించిన ఆయన తన తర్వాత చేయబోయే సినిమాలతో కూడా ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టలనే ప్రయత్నం చేస్తున్నాడు…సుకుమార్ మహేష్ బాబు(Mahesh Babu)తో ‘వన్ నేనొక్కడినే’ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉండడంతో ప్రేక్షకులు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు. తద్వారా ఈ సినిమా ఫ్లాప్ అయింది… ఇక ఆ తర్వాత ఆయన నాన్నకు ప్రేమతో, రంగస్థలం లాంటి సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించాడు. ఇక అప్పుడు మహేష్ బాబు సుకుమార్ ను పిలిచి మరి సినిమా చేద్దామని చెప్పారట. అయితే సుకుమార్ పుష్ప(Pushpa) సినిమా కథని మహేష్ బాబు వినిపించాడు. కానీ మహేష్ బాబు మాత్రం ఆ కథని రిజెక్ట్ చేశాడు.
ఈ విషయంలో సుకుమార్ బాగా హర్ట్ అయ్యాడు. అందుకే ఈ కథతోనే సూపర్ సక్సెస్ కొట్టాలి అనుకొని అల్లు అర్జున్ తో పుష్ప సినిమాను తీశారు. మొదటి పార్ట్ మంచి విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ మీద భారీ హైప్ అయితే క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమాను చేసి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు.
అయితే మహేష్ బాబు సుకుమార్ ని ప్రతిసారి సరిగ్గా జడ్జ్ చేయలేకపోతున్నాడనే కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలి అంటే చాలా వరకు ఓపిక తో వేచి ఉండాలి.
అలాగే ఆయన డిఫరెంట్ క్యారెక్టరైజేశన్ ను రాస్తూ ఉంటాడు. కాబట్టి ఆ క్యారెక్టర్ లో హీరో తనని తాను ఊహించుకోగలిగాలి అలా చేసినప్పుడే ఆ హీరోకి మంచి గుర్తింపు అయితే వస్తుంది. ఇప్పుడు ఆయన రామ్ చరణ్ తో మరో సినిమా చేయబోతున్నాడు. కాబట్టి ఈ సినిమాతో కూడా భారీ సక్సెస్ ని సాధించి ఇండియా లో నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదగాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…