Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్న రాజమౌళి ప్రస్తుతం తను చేస్తున్న సినిమా మీద భారీ అంచనాలను పెంచుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన సినిమాలను చూడడానికి యావత్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తోందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ లో సినిమా చేయడానికి సిద్ధమైన విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు ఈ సంవత్సరం జనవరిలో ‘గుంటూరు కారం’ సినిమాని విడుదల చేసిన తర్వాత అప్పటినుంచి ఇప్పటివరకు ఖాళీగానే ఉంటున్నాడు. రాజమౌళితో చేయబోయే సినిమాకు సంబంధించిన మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ ఆయన మిగతా ఏ షూటింగ్ ల్లో కూడా పాల్గొనడం లేదనేది వాస్తవం… మరి ఇలాంటి సందర్భంలో ఆయన గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ముఖానికి మేకప్ వేసుకోకుండా ఖాళీగానే ఉంటున్నాడు. అంటే దాదాపు తొమ్మిది నెలల నుంచి ఆయన ఖాళీగా ఉండటం వల్ల మహేష్ బాబు అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్యాప్ లో మహేష్ బాబు మరొక సినిమా కూడా చేసుకొని ఉండొచ్చు.
కానీ రాజమౌళి పెట్టిన కండిషన్స్ అన్నింటికీ అంగీకరించాడు కాబట్టి మహేష్ బాబు మూడు సంవత్సరాల పాటు రాజమౌళి చెప్పినట్టుగా వినాల్సి ఉంటుంది. ఇక మహేష్ బాబు చేసే యాడ్ ఫిల్మ్స్ గాని, సినిమాలు గాని చేసుకుంటూ ఆయన ఎప్పుడూ చాలా బిజీగా కొనసాగుతూ ఉంటాడు.అలాంటి మహేష్ బాబు తొమ్మిది నెలల నుంచి ఖాళీగా ఉండటం వల్ల దాదాపు మహేష్ బాబు ఒక 100 కోట్ల వరకు డబ్బులను లాస్ అయినట్టుగా కూడా తెలుస్తోంది.
ఇక ఆయనకు కొన్ని కొత్త బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని ఆఫర్స్ వచ్చినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో షూటింగ్స్ చేయాలేడు కాబట్టి యాడ్స్ కంపెనీలకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇక మొత్తానికైతే రాజమౌళి వల్ల మహేష్ బాబు తీవ్రంగా నష్టపోతున్నాడనే చెప్పాలి.
మరి ఎట్టకేలకు ఈ షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయాల మీద రాజమౌళి ఎప్పుడు క్లారిటీ ఇస్తాడు అనే ధోరణి లో కూడా అభిమానులు చాలా తీవ్రమైన నిరాశనైతే వ్యక్తం చేస్తున్నారు… చూడాలి మరి ఈ సినిమాతో మహేష్ బాబు రాజమౌళి ఇద్దరూ పాన్ వరల్డ్ లో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తారా లేదా అనేది…