Mahesh Babu and Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక స్టార్ హీరోల విషయానికి వస్తే తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా వాళ్లు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా మొత్తంలో తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతున్న నేపధ్యంలో మన హీరోలు ఎవరికి వారు పోటీపడుతూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటూ వార్తలైతే వస్తున్నాయి. కానీ ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, తెరమీదకి ఎప్పుడు వస్తుందనే దానిమీద ఎవ్వరు సరైన క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నారు. కానీ ఈరోజు మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ పూజకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా పూజా కార్యక్రమానికి సంభందించి మహేష్ బాబు తన సెంటిమెంట్ ను బ్రేక్ చేసుకుని ముందుకు సాగినట్టుగా తెలుస్తోంది.
గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఆయన సినిమాకు ముహూర్తం రోజున హాజరవ్వడం లేదు… తన భార్య అయిన నమ్రత తన పిల్లల్ని మాత్రమే పూజ కార్యక్రమాలకు పంపిస్తూ ఆయన సినిమా షూటింగ్ లో మాత్రమే పాల్గొంటూ వస్తున్నాడు. కానీ చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొని తన సెంటిమెంట్ ను అయితే బ్రేక్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ సంక్రాంతి తర్వాత నుంచి జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే రాజమౌళి ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేసి 2027 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
అంటే దాదాపు ఈ సినిమా రిలీజ్ కి మరో రెండు సంవత్సరాల సమయం ఉందనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో రాజమౌళి ఎక్కడ రాజీ పడకుండా ముందుకు సాగుతున్నాడు…ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా విలన్ గా పృధ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా భారీ విజయాన్ని సాధించాలని తద్వారా ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమాను తీర్చిదిద్దబోతున్నట్టుగా తెలుస్తోంది…