https://oktelugu.com/

ఇదీ.. ఈ మ‌హేషే మాక్కావాల్సింది!

మ‌హేష్ బాబు ఎలాంటి న‌టుడు అన్న‌ది స్పెషల్ ఇంట్రో ఇవ్వాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ కు సంపూర్ణ అర్హుడు. అయితే.. అలాంటి న‌టుడిపై ఓ కంప్లైంట్ ఉంది. దానికి ద‌ర్శ‌కుల‌ను బాధ్యుల‌ను చేయాలా? డెసిషన్ ఫైనల్ ప్రిన్స్ దే కాబట్టి.. ఆయ‌నే ఆన్స‌ర్ ఇవ్వాలా? అనేది తెలియ‌దుగానీ.. మొత్తానికి ఒక ప్ర‌శ్న అయితే చాలా మంది బుర్ర‌ల‌ను తొలిచేస్తూ ఉంది. అదేమంటే.. మ‌హేష్ క్యారెక్ట‌రైజేష‌న్ గురించి. ఆయ‌న సినిమా వ‌స్తోందంటే.. మ‌హేష్ […]

Written By:
  • Rocky
  • , Updated On : August 9, 2021 / 05:39 PM IST
    Follow us on

    మ‌హేష్ బాబు ఎలాంటి న‌టుడు అన్న‌ది స్పెషల్ ఇంట్రో ఇవ్వాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ కు సంపూర్ణ అర్హుడు. అయితే.. అలాంటి న‌టుడిపై ఓ కంప్లైంట్ ఉంది. దానికి ద‌ర్శ‌కుల‌ను బాధ్యుల‌ను చేయాలా? డెసిషన్ ఫైనల్ ప్రిన్స్ దే కాబట్టి.. ఆయ‌నే ఆన్స‌ర్ ఇవ్వాలా? అనేది తెలియ‌దుగానీ.. మొత్తానికి ఒక ప్ర‌శ్న అయితే చాలా మంది బుర్ర‌ల‌ను తొలిచేస్తూ ఉంది. అదేమంటే.. మ‌హేష్ క్యారెక్ట‌రైజేష‌న్ గురించి. ఆయ‌న సినిమా వ‌స్తోందంటే.. మ‌హేష్ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో చెప్పేసే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఒక సీరియ‌స్ మోడ్ లో.. ఎప్పుడూ మూడీగా ఉండే క్యారెక్ట‌ర్ ప్లే చేస్తాడ‌నే ఒక స్థాయి న‌మ్మ‌కం ఆడియ‌న్స్ కు వ‌చ్చేసింది.

    పోకిరి, అత‌డు, శ్రీమంతుడు, బ్ర‌హ్మోత్స‌వం, భ‌ర‌త్ అను నేను, స్పైడ‌ర్‌.. ఈ చిత్రాల‌ను గ‌మ‌నిస్తే.. హీరో క్యారెక్టరైజేష‌న్ ఇంచు మించు ఒకే విధంగా ఉంటుంది. ఇలాంటి లుక్స్ లో మ‌హేష్ ను చూసి బోర్ ఫీల‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని కొంద‌రు అభిమానులు ఆవేద‌న కూడా వ్య‌క్తం చేస్తున్న ప‌రిస్థితి. ఖ‌లేజా, దూకుడు వంటి సినిమాలు మిన‌హాయిస్తే.. పెద్ద‌గా వేరియేష‌న్ చూపించే సినిమాలు మ‌హేష్ నుంచి క‌నిపించ‌వు. ఆగ‌డు డిజాస్ట‌ర్ అయిపోవ‌డంతో.. మ‌రోసారి ఆ త‌ర‌హా ప్ర‌యోగం చేయ‌లేద‌నే చెప్పాలి.

    అయితే.. ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ చేసిన స‌ర్కారు వారిపాట టీజ‌ర్ చూసిన త‌ర్వాత ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. మ‌హేష్ లుక్స్ తోపాటు క్యారెక్ట‌రైజేష‌న్ స‌మ్ థింగ్ డిఫ‌రెంట్ గా ఉంద‌ని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల‌వుతున్నారు. అంతేకాదు.. సీరియ‌స్ మోడ్ లోంచి కామెడీ యాంగిల్ లో సినిమా ర‌న్ కాబోతోంద‌నే హింట్ కూడా ఛేంజోవ‌ర్ లా అనిపిస్తోంది. దీంతో.. అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

    మ‌హేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా తాము కోరుకున్న మ‌హేష్ ను చూపించార‌ని, అస‌లు మాక్కావాల్సింది ఇలాంటి మ‌హేషే అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. మొత్తానికి చాలా కాలం త‌ర్వాత ప్రిన్స్ ను డిఫ‌రెంట్ లుక్ లో చూస్తున్నామ‌ని హ్యాపీ ఫీల‌వుతున్నారు. ఈ లెక్క‌న సినిమా కూడా కుమ్మేస్తుంద‌ని సంబ‌ర ప‌డుతున్నారు.