మెగా బ్రదర్ నాగబాబు వ్యాఖ్యలతో పవన్ కు ఇరకాటం

జనసేన కొత్త పల్లవి అందుకుంటోంది. రాష్ర్టపతి ఎన్నిక వ్యవహారంలో తీసుకునే నిర్ణయంపై తన వాణి వినిపిస్తోంది. రాష్ర్టపతి ఎన్నికకు ఇంకా సమయం ఉండగానే పార్టీ తన ఉద్దేశాన్ని ప్రకటించడంపై అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలో ఎంతో పెద్ద పేరున్న వ్యక్తి రాష్ర్టపతి కావాలని కోరుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు మదిలో ఈ అంశం ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. […]

Written By: Srinivas, Updated On : August 9, 2021 5:55 pm
Follow us on

జనసేన కొత్త పల్లవి అందుకుంటోంది. రాష్ర్టపతి ఎన్నిక వ్యవహారంలో తీసుకునే నిర్ణయంపై తన వాణి వినిపిస్తోంది. రాష్ర్టపతి ఎన్నికకు ఇంకా సమయం ఉండగానే పార్టీ తన ఉద్దేశాన్ని ప్రకటించడంపై అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలో ఎంతో పెద్ద పేరున్న వ్యక్తి రాష్ర్టపతి కావాలని కోరుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.

మెగా బ్రదర్ నాగబాబు మదిలో ఈ అంశం ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. కానీ తన మనసులోని మాటను మాత్రం బయట పెట్టారు. రాష్ర్టపతి ఎన్నికపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్ పదవీ కాలం ఇంకా పది నెలలు ఉండడంతో ఇంత ముందుగా ఆయన ఉద్దేశం వెల్లడించడంపై అందరిలో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. అయితే రాష్ర్టపతి ఎన్నికలో జనసేనకు ప్రాతినిధ్యం సైతం లేకపోవడం గమనార్హం. అయితే ఇంత అకస్మాత్తుగా ఆయన రతన్ టాటా పేరును సూచించడంలో ఏదైనా మతలబు ఉందా అని ఆరా తీస్తున్నారు.

బీజేపీ-జనసేన పార్టీల్లో పొత్తు మాత్రం ఉంది. కేంద్రంలో తదుపరి రాష్ర్టపతి ఎన్నికపై బీజేపీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న బలం ఆధారంగా రాష్ర్టపతి ఎన్నిక జరుగుతుందని తెలిసిందే. నాగబాబు స్పందించిన తీరుపై ఇప్పటికే పలు రకాలుగా చర్చ జరుగుతోంది. రాష్ర్టపతి ఎన్నికపై ఆయన మనసులో మాట చెప్పినా అందులో ఎవరి ప్రమేయం ఉందా అనే కోణంలో ఆలోచిస్తున్నారు. దేశంలో జరిగే పరిస్థితులను చూసి చలించి పోయి నాగబాబు ఈ ప్రస్తావన చేసినట్లు తెలుస్తోంది.

వ్యాపార రంగంలో దూసుకుపోతున్న రతన్ టాటాకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదనే తెలుస్తోంది. దీంతో ఆయన రాష్ర్టపతి పదవి కోసం పోటీలో ఉంటారని ఎవరు అనుకోవడం లేదు. గతంలో మాజీ రాష్ర్టపతి రంగరాజన్ ఎన్నికలో అప్పటి టీడీపీ ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో జనసేన నేతగా నాగబాబు ఈ ప్రస్తావన తెచ్చారనే వాదన సైతం వినిపిస్తోంది. కానీ నాగబాబు ప్రస్తావన కార్యరూపం దాల్చే ఆశ నెరవేరుతుందా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

దీంతో జనసేన కూడా తన ప్రభావం రాష్ర్టపతి ఎన్నికలో ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే నాగబాబు ఈ విధంగా మాట్లాడినట్లు సమాచారం. కానీ మొత్తానికి జనసేన ఆశలు నెరవేర్చేందుకు మిత్రపక్షమైన బీజేపీ సహకరిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా ఒక కొత్త పాట అందుకుని జన సేన కూడా ప్రచారానికి పెద్ద పీట వేస్తోంది.