Sarkaru Vaari Paata: మహేష్ – కీర్తి సురేష్ రొమాన్సే చివరి ఘట్టం !

Sarkaru Vaari Paata: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ సినిమా ‘సర్కారు వారి పాట’. కాగా, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. కాకపోతే.. ఈ సినిమాలోని చివరి సాంగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. అయితే.. ‘సర్కారు వారి పాట’ చివరి సాంగ్ షూట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో ఆల్ రెడీ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం శరవేగంగా ఈ పాట చిత్రీకరణ […]

Written By: Shiva, Updated On : April 18, 2022 12:49 pm
Follow us on

Sarkaru Vaari Paata: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ సినిమా ‘సర్కారు వారి పాట’. కాగా, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. కాకపోతే.. ఈ సినిమాలోని చివరి సాంగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. అయితే.. ‘సర్కారు వారి పాట’ చివరి సాంగ్ షూట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో ఆల్ రెడీ స్టార్ట్ చేశారు.

Sarkaru Vari Pata

ప్రస్తుతం శరవేగంగా ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని చిత్రబృందం ట్వీట్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది. ఈ సాంగ్ లో మహేష్ లుక్స్ అదిరిపోతాయట. పైగా ఈ సాంగ్ షూట్ కి సంబంధించిన పిక్స్ ను కూడా మరికొన్ని గంటల్లో చిత్రబృందం పోస్ట్ చేస్తామని చెప్పుకొచ్చింది. కాగా ఈ సాంగ్ షూట్ లో మహేష్, హీరోయిన్ కీర్తి సురేష్, అలాగే కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా పాల్గొననున్నారు.

Also Read: Anil Kumar Yadav: అధిష్టానానికి భయపడి అనిల్ కుమార్ యాదవ్.. పోటీ సభలో కూల్ కూల్ వ్యాఖ్యలు

ఈ సాంగ్ ఎక్కువగా మహేష్ – కీర్తి సురేష్ మధ్య సాగుతుందట. ఈ సాంగ్ లో మహేష్ – కీర్తి మధ్య లవ్ బిల్డప్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయట. అన్నట్టు ఈ సినిమాలో కీర్తి సురేష్ మహేష్ కలయికలో వచ్చే ప్యూర్ రొమాంటిక్ ట్రాక్ కూడా చాలా బాగుంటుందట. మొత్తానికి ‘సర్కారు వారి పాట’ భారీ కమర్షియల్ హిట్ అయ్యేలా ఉందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.

అందుకే ఖర్చుకు కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ క్రేజీ సినిమా.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ సాగనుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకుగా కనిపించబోతున్నాడు.

Also Read: Roja: రోజాపై అలాంటి పంచ్ లు వేసిన రాకెట్ రాఘవ.. ఎత్తుకు ఎదిగిపోయారంటూ?

తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి తిరిగి మహేష్ ఆ డబ్బును ఎలా రాబట్టాడు ? ఈ క్రమంలో ఏమి చేశాడు ? అనే కోణం ఈ సినిమాలో వెరీ ఇంట్రెస్ట్ గా ఉండబోతుందట. మరి కథలో మెయిన్ పాయింట్ అయితే బాగానే ఇంట్రెస్ట్ గా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Tags