OkTelugu Movie Time: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి దంపతులు శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ‘చాలాకాలం తర్వాత స్వామిని దర్శించుకున్నాను. అయితే భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి కారణంగా కాలి నడకన కాకుండా డోలీలో సన్నిధికి వెళ్లాల్సి వచ్చింది. ఆ స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం శ్రమ ధారపోస్తున్న డోలీ సోదరులకు నా హృదయాంజలి’ అని ట్వీట్ చేశాడు.

Visiting #sabarimalatemple #feelingblessed pic.twitter.com/kdtfxXszcl
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 13, 2022
మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విషయానికి వస్తే.. మోహన్ బాబు నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ మూవీ ప్రీరిలీజ్ వేడుకలో నటుడు పోసాని కృష్ణమురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ మూవీలో మోహన్‌బాబు నాకు మంచి పాత్ర ఇచ్చారు. అన్నయ్య గురించి తెలియని వారు ఇండస్ట్రీలో లేరు. స్వచ్ఛమైన మనసుతో మాట్లాడతారు. ‘మా’ ఎన్నికల్లో ఎవరూ సాధించిన రీతిలో మంచు విష్ణు విజయం సాధించాడు. అతడు మామూలు మనిషి. గొప్పవాడేమీ కాదు. మనిషి లక్షణాలతో పుట్టినవాడు కాబట్టే గెలిచాడు’ అని అన్నాడు.


ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. భర్త రాజ్‌కుంద్రా అశ్లీల వీడియోల కేసుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి శిల్పాశెట్టి మరో వివాదంలో ఇరుక్కుంది. ఆమె తండ్రి సురేంద్రశెట్టి తమ వద్ద అప్పు తీసుకున్నాక మరణించారని, ఆ విషయం తెలిసి కూడా కుటుంబసభ్యులు తిరిగి చెల్లించడం లేదని ఓ ఆటోమొబైల్ ఏజెన్సీ ముంబై కోర్టును ఆశ్రయించింది.
Also Read: మహేష్ తో కలిసి దుమ్మురేపుతున్న కళావతి

కాగా దీంతో శిల్పాశెట్టి, సోదరి షమితాశెట్టి, తల్లి సునందశెట్టి ఈ నెల 28న కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. మరి దీనిపై శిల్పాశెట్టి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. శిల్పాశెట్టి ఇప్పటికైనా ఇలాంటి విషయాల్లో ఇలా అడ్డంగా బుక్ అవ్వకుండా జాగ్రత్త పడుతుందేమో చూడాలి.
Also Read: రవితేజ ‘ధమాకా’ నుంచి క్రేజీ అప్ డేట్ !
[…] […]