Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి(SS Rajamouli) షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. రాజమౌళి సినిమా షూటింగ్ అంటే, అది ఎప్పుడు పూర్తి అవుతుందో రాజమౌళి కి కూడా తెలియదు. 2027 లో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు కానీ, అది దాదాపుగా అసాధ్యమే. ఈ సినిమా పూర్తి అయ్యి, థియేటర్స్ లో వచ్చే సమయానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా వచ్చేస్తాయి. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కి ఇక లైన్ లోకి వచ్చేస్తాడు. తన తోటి స్టార్ హీరోలు లాగానే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తాడు, ఇండియా లో మనోడు కూడా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిపోయినట్టే అని మహేష్ ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ మహేష్ బాబు ఆ లైన్ లోకి వెళ్లడం లేదు, మన తన పాత కమర్షియల్ స్టైల్ లోనే సినిమాలు చేసేలా అనిపిస్తున్నాడు.
విషయం లోకి వెళ్తే రీసెంట్ గానే ఒక చిన్న డైరెక్టర్ మహేష్ బాబు ని కలిసి, ఒక కథ ని వినిపించాడట. అది మహేష్ కి ఎంతో నచ్చిందంట, ఈ సినిమాలో ఆయన హీరో గా నటించడానికి మాత్రమే కాదు, నిర్మాతగా కూడా వ్యవహరించడానికి సిద్దమయ్యాడట. అసలు ఎవరు ఆ డైరెక్టర్?, రాజమౌళి తో పాన్ వరల్డ్ సినిమా తీసిన తర్వాత మహేష్ ఆ డైరెక్టర్ తో కమర్షియల్ సినిమాలు తీస్తే ఎవరు చూస్తారు? అని మహేష్ బాబు ఫ్యాన్స్ భయపడాల్సిన అవసరమే లేదు. చిన్న డైరెక్టర్ అయినప్పటికీ, అతనితో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమానే చేయబోతున్నాడట మహేష్. ఇలా కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడం లో తప్పు లేదు కానీ, ఎలాంటి అనుభవం లేని చిన్న డైరెక్టర్ కి అంత పెద్ద బడ్జెట్ సినిమా ఇస్తే ఎంత వరకు హ్యాండిల్ చేయగలరు అనేది మహేష్ ఫ్యాన్స్ నుండి ఎదురు అవుతున్న ప్రశ్న.
ఉదాహరణకు ఓజీ దర్శకుడు సుజిత్ నే తీసుకుందాం. ఈ సినిమాకు ముందు ఆయన తీసిన చిత్రం ‘సాహూ’. ప్రభాస్ హీరో గా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. టాలెంట్ లేని దర్శకుడా అంటే కాదు. మొదటి సినిమా రన్ రాజా రన్ చాలా పెద్ద హిట్ అయ్యింది. కానీ బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ ఇమేజ్ ని, అంత పెద్ద బడ్జెట్ ని హ్యాండిల్ చేయడం లో కాస్త తడబడ్డాడు సుజిత్. అందుకే సినిమా ఫలితం కాస్త తేడా గా వచ్చింది. ఇప్పుడు మహేష్ బాబు కూడా అలాంటి రిస్క్ చేయబోతున్నాడు. కానీ మహేష్ అంత తేలికగా ఒక కొత్త కుర్రాడికి సినిమా అవకాశం ఇవ్వదు. ఆయన ఫిల్మోగ్రఫీ మొత్తం చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. అలాంటి మహేష్ ఒక కొత్త కుర్రాడికి అవకాశం ఇచ్చాడంటే, కచ్చితంగా అతనిలో ఎదో స్పెషల్ ఉన్నట్టే అనుకోవాలి. చూడాలి మరి ఏమి జరగబోతుందో.