Mahesh Babu: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న ఎస్ జె సూర్య ప్రస్తుతం తనదైన రీతిలో నట విశ్వరూపాన్ని చూపిస్తూ నటుడి గా కూడా రాణిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన నటుడిగా ‘నేషనల్ అవార్డు’ని కూడా అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు నాని హీరోగా ‘సరిపోదా శనివారం’ అనే సినిమాలో విలన్ పాత్రను పోషించి ఇక మీద ప్రశంశలను కూడా అందుకుంటున్నాడు. తన నట విశ్వరూపాన్ని చూపించడమే కాకుండా ప్రేక్షకులందరి చేత సుభాష్ అనిపించుకునేలా నటించాడు. ఇక మొత్తానికైతే ఆయన నటనను చూసిన తెలుగు ప్రేక్షకులందరూ ఫిదా అవుతున్నారు. ఇక పెద్ద సినిమాల నుంచి కూడా ఆయనకు భారీ ఆఫర్లైతే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఇక ఇంతకు ముందు మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘స్పైడర్ ‘ సినిమాలో విలన్ గా నటించినప్పటికీ ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన క్యారెక్టర్ కి పెద్దగా గుర్తింపైతే రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాతో తనదైన మార్క్ నటన ను చూపిస్తూ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఖుషి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న ఆయన ఖుషి 2 సినిమాను కూడా పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకున్నాడు. కానీ కాటమ రాయుడు సినిమా చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ మొదట ఎస్ జే సూర్యనే దర్శకుడిగా తీసుకున్నాడు.
కానీ మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్ సినిమాలో విలన్ గా అవకాశం రావడంతో ఈ సినిమాని వదిలేసి స్పైడర్ సినిమాలో నటించడానికి సిద్ధమయ్యాడు. దాంతో కోపానికి వచ్చిన పవన్ కళ్యాణ్ డాలీ ని ఆ సినిమా దర్శకుడి గా తీసుకొని కాటమ రాయుడు సినిమాని పూర్తి చేశాడు. ఇక దాంతో వీళ్లిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. అందువల్లే ఖుషి 2 సినిమా పట్టాలెక్కడం లేదనేది వాస్తవం. మరి ఇప్పటికైనా వీళ్ళ కాంబినేషన్ లో రావాల్సిన ఖుషి 2 సినిమా వస్తుందా లేదా అనే విషయం లో క్లారిటీ లేకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక మంచి ఫ్రెండ్స్ గా ఉన్న పవన్ కళ్యాణ్, ఎస్ జే సూర్య ల మధ్య మహేష్ బాబు తన స్పైడర్ సినిమాతో వచ్చి వీళ్ళ మధ్య గొడవ పెట్టడంటూ మరికొంత మంది వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు… ఇక ఇది ఏమైనప్పటికి నటుడిగా స్థిరపడిన ఎస్ జె సూర్య ఇప్పుడప్పుడే డైరెక్షన్ చేసే అవకాశాలు అయితే లేనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన చాలా బిజి నటుడిగా కొనసాగుతూ ఇండస్ట్రీలో చాలా మంచి పేరునైతే సంపాదించుకుంటున్నాడు…