https://oktelugu.com/

Bigg Boss 8 Abhay’s Wife : బిగ్ బాస్ 8′ కంటెస్టెంట్ అభయ్ భార్యని చూసారా..? హీరోయిన్స్ కూడా ఈమె అందం ముందు పనికిరారు!

నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడని అనుకున్నారు అందరూ. అతను నిజంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్, కానీ అనేక విషయాల్లో ఆయన అయ్యోమయ్యం కి గురి అవుతున్నాడు. కానీ అభయ్ లో అలాంటి అయ్యోమయ్యం ఏమి లేదు, తాను నమ్మింది బలంగా అనుసరిస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే అభయ్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత అతని గురించి తెలుసుకునేందుకు నెటిజెన్స్ పలు ప్రయత్నాలు చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 9, 2024 / 07:49 PM IST

    Bigg Boss 8 Abhay's Wife

    Follow us on

    Bigg Boss 8 Abhay’s Wife :  ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్న కంటెస్టెంట్స్ లో ఒకరు అభయ్. ‘పెళ్లి చూపులు’ చిత్రం లో కమెడియన్ గా నటించిన ఈయన, ఆ తర్వాత అనేక సినిమాల్లో కమెడియన్ గా చేసాడు. పలు చిత్రాలలో ఆయన హీరో గా కూడా చేసాడు. మంచి గుర్తింపు వచ్చింది కానీ, మిగతా కమెడియన్స్ లాగా ఆడియన్స్ కి ఈయన కనెక్ట్ అవ్వలేదు. అందుకే బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఈయన ఆట తీరు మొదటి వారంలో బాగానే ఉంది కానీ, తన తోటి కంటెస్టెంట్ సీత మీద మాత్రం చాలా ఫైర్ అయ్యి, నోరు జారీ అనేక పదాలు వదిలేసాడు. అక్కడ ఒక్కటే ఆయనకీ ఆడియన్స్ బ్యాడ్ రిమార్క్ పడింది. కానీ టాస్కులు ఆడడంలో కానీ, నామినేషన్స్ లో సరైన పాయింట్ ని పట్టుకొని మాట్లాడడంలో కానీ, తనని తానూ డిఫెండ్ చేసుకునే విధానంలో కానీ, ఎంటర్టైన్మెంట్ పంచడంలో కానీ అభయ్ హౌస్ లో అందరికంటే చాలా బెటర్ గా అనిపిస్తున్నాడు.

    నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడని అనుకున్నారు అందరూ. అతను నిజంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్, కానీ అనేక విషయాల్లో ఆయన అయ్యోమయ్యం కి గురి అవుతున్నాడు. కానీ అభయ్ లో అలాంటి అయ్యోమయ్యం ఏమి లేదు, తాను నమ్మింది బలంగా అనుసరిస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే అభయ్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత అతని గురించి తెలుసుకునేందుకు నెటిజెన్స్ పలు ప్రయత్నాలు చేసారు. ఆ ప్రయత్నంలో అభయ్ కి సంబంధించి కొన్ని వ్యక్తిగత విషయాలు తెలిసాయి. అంతే కాకుండా అతని సతీమణి ఫోటోలు కూడా చాలా కనిపించాయి. ఆమెని చూసిన ప్రతీ ఒక్కరు ఈ అమ్మాయి చాలా నేచురల్ బ్యూటీ తో ఉంది, సినిమా హీరోయిన్స్ ని మేకప్ తీస్తే అసలు చూడలేం, కానీ ఈ అమ్మాయి మేకప్ లేకపోయినా కూడా చాలా అందంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. అయితే వీళ్ళ పెళ్లి ఎప్పుడు జరిగింది, అమ్మాయి పేరు ఏమిటి, ఎక్కడ నుండి వచ్చింది వంటి వివరాలు ప్రస్తుతానికి తెలియవు.

    త్వరలోనే బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ ఉంటుంది, అప్పుడు కచ్చితంగా ఈ విషయాలు బయటపడొచ్చు. ఇదంతా పక్కన పెడితే అభయ్ ఈ వారం కూడా నామినేషన్స్ నుండి తప్పించుకున్నాడు. నామినేషన్స్ లోకి ఎన్నిసార్లు వస్తే, కంటెస్టెంట్స్ కి అంతటి ఫాలోయింగ్ పెరుగుతుంది. వరుసగా నామినేషన్స్ తప్పించుకుంటూ వెళ్తూ, ఎదో ఒకరోజు నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేషన్ అయిపోతారు. అందుకు బెస్ట్ ఉదాహరణ గత సీజన్ లో సందీప్ మాస్టర్. టాస్కులు అద్భుతంగా ఆడే ఈయన, వరుసగా ఆరు వారాలు నామినేషన్స్ లోకి రాలేదు, ఒక్కసారి వచ్చాడు ఎలిమినేట్ అయ్యాడు. అభయ్ పరిస్థితి కూడా అలా తయారు కానుందా, లేదా అనేది చూడాలి.