Mahesh Babu : సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరించేవాడు. ఆయన లాంటి దర్శకుడు ఈ జనరేషన్ లో ఎవరు లేరు అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అప్పట్లో ఆయన చేసిన సినిమాలు ఒక ట్రెండ్ ని క్రియేట్ చేశాయి, ఇప్పుడున్న దర్శకుల్లో అలాంటి దర్శకుడు ఎవరు లేరు కాబట్టే ఆయన చేసిన సినిమాలను ఆడియన్స్ రిపీటెడ్ గా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే ఈయన అలీ ని హీరోగా పెట్టి చేసిన యమలీల సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ సినిమాలో మొదట హీరోగా మహేష్ బాబుని తీసుకుందాం అనుకున్నారు. ఈ సినిమాతో మహేష్ బాబు ఇండస్ట్రీ కి హీరో గా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఎస్ వి కృష్ణారెడ్డి సూపర్ స్టార్ కృష్ణ గారిని అడిగితే, అప్పుడు కృష్ణ దీనికి ససేమిరా అన్నాడట.. మహేష్ బాబు ఎంట్రీ కి ఇంకా కొంచెం సమయం తీసుకుంటాం అని చెప్పి ఆ సబ్జెక్ట్ ను రిజెక్ట్ చేశాడు.
దానివల్ల ఆ సినిమా స్టోరీ తెలిసిన బ్రహ్మానందం ఆలీని హీరోగా పెట్టీ ఈ సినిమా చేయొచ్చు కదా అని ఎస్ వి కృష్ణారెడ్డికి ఒక సలహా ఇవ్వడంతో, ఆయన కూడా బాగా ఆలోచించి అలీని పెట్టి యమలీల సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కడం వల్ల ఈ సినిమాలో మ్యూజిక్ గానీ, కామెడీ గానీ సెంటిమెంట్ గానీ దేనికి అదే సపరేట్ గా ప్రేక్షకులను అలరిస్తాయి. అందువల్లే ఈ సినిమా సిల్వర్ జూబ్లీ ఆడింది. ఇక ఆలీ కెరియర్ లోనే ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్టుగా చెప్పవచ్చు.
ఇక అప్పటినుంచి ఆలీ హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశాడు. అయితే అవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు మళ్లీ కమెడియన్ గా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ముందుకు సాగుతున్నాడు. మొత్తానికైతే మహేష్ బాబు ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నాడనే చెప్పాలి. ఇక ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు అభిమానులు కొంతవరకు బాధపడుతున్నారనే చెప్పాలి…