Mahesh Babu to beat NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప ఐడెంటిటిని తీసుకురావడమే కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియా ప్రేక్షకులను సైతం మెప్పిస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…ఇక ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నవాడవుతాడు… లేకపోతే మాత్రం ఆయన ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరి కంటే వెనుకబడిపోయే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప విజయాలను సంపాదించి పెట్టాయి.
ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో ప్రపంచ ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ రికార్డులను సైతం బ్రేక్ చేయాలని మహేష్ బాబు చూస్తున్నట్టుగా తెలుస్తోంది… నిజానికి ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ మహేష్ బాబు కి లేదు.
మహేష్ కి ఎక్కువగా అమ్మాయిల ఫాలోయింగ్ మాత్రమే ఉంది. కానీ ఎన్టీఆర్ కి మాత్రం బీ, సీ సెంటర్లో భారీ మాస్ ఫాలోయింగ్ ఉండటం వల్ల అతనికి చాలా వరకు హెల్ప్ అవుతోంది. మరి ఈ క్రమంలోనే ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న సినిమాతో మహేష్ బాబు సైతం బీ,సీ సెంటర్లో మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ రికార్డు ను బ్రేక్ చేసి మరి బీ,సీ సెంటర్లో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో మహేష్ బాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎన్టీఆర్ రికార్డును బ్రేక్ చేసి మహేష్ బాబు టాప్ రేంజ్ లోకి వెళ్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…