Mahesh Babu Rajamouli Movie: మహేష్ బాబుది హాలీవుడ్ కట్ అవుట్. చక్కని రూపంతో పాటు ఆరడుగుల ఆజానుబాహుడు. అయితే ఆయన ఎప్పుడూ సిక్స్ ప్యాక్ చేయలేదు. చొక్కా విప్పి నటించలేదు. రాజమౌళి అది చేయించబోతున్నాడేమో అనిపిస్తుంది. మహేష్-రాజమౌళి మూవీ సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకా చాలా సమయం ఉంది. ఈ లోపు మహేష్ ని పాత్రకు తగ్గట్లు సిద్ధం చేస్తున్నాడని సమాచారం. మహేష్ గంటల తరబడి జిమ్ లో శ్రమిస్తున్నారు. కండలు పెంచి శరీర ధారుడ్యం సాధించడం కోసం కష్టపడుతున్నారు.
మహేష్ బాబుని రాజమౌళి కండల వీరుడిగా చూపించే అవకాశం కలదు. దానిలో భాగమే ఈ కసరత్తులని తెలుస్తుంది. తాజాగా మహేష్ బాబు మరో ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. మహేష్ చేతి కండరాలకు సంబంధించిన వ్యాయామం చేస్తున్నాడు. శ్రమిస్తుంటే శక్తి పొందుతున్న భావన కలుగుతుందని కామెంట్ పోస్ట్ చేశాడు. మహేష్ షేర్ చేసిన ఈ పిక్ క్షణాల్లో వైరల్ అయ్యింది. ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు.
ప్రస్తుతం రాజమౌళి-విజయేంద్రప్రసాద్ ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. త్వరలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుకానుంది. రాజమౌళి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. దాదాపు రూ. 800 కోట్లు కేటాయించారని సమాచారం. ఇక ఇది ప్రపంచాన్ని చుట్టే సాహసికుడి కథ అని చెప్పారు. జంగిల్ అడ్వెంచర్ డ్రామా. ఇండియానా జోన్స్ ని తలపించే చిత్రం అంటున్నారు.
భారీ క్యాస్టింగ్ తో పాటు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేయనున్నారని సమాచారం. ఈ చిత్రంపై ఇండియా వైడ్ అంచనాలు ఉన్నాయి. మరోవైపు మహేష్ గుంటూరు కారం మూవీ పూర్తి చేస్తున్నారు. గుంటూరు కారంకి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. అనుకున్న ప్రకారం షూటింగ్ జరగడం లేదు. హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు టెక్నీషియన్స్ కూడా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. సంక్రాంతికి విడుదల అన్నారు కానీ ఆ సూచనలు లేవు.