Bhola Shankar Collections: చెప్పాలంటే భోళా శంకర్ వసూళ్లు దాదాపు నెమ్మదించాయి. ఈ చిత్ర కలెక్షన్స్ లక్షలకు పడిపోయాయి. వరల్డ్ వైడ్ మొత్తం కలిపినా కోటి రూపాయల షేర్ రావడం లేదు. ఫస్ట్ డే భోళా శంకర్ వరల్డ్ వైడ్ రూ. 17 కోట్ల షేర్ రాబట్టింది. మెగాస్టార్ చిరంజీవి రేంజ్ కి ఇవి తక్కువ వసూళ్లే. అయితే సెకండ్ డే దారుణంగా పడిపోయాయి. 70 శాతానికి పైగా వసూళ్లు తగ్గాయి. వీకెండ్ వరకు ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిన భోళా శంకర్ సోమవారం దారుణంగా పడిపోయింది.
ఇండిపెండెన్స్ డేను భోళా శంకర్ ఉపయోగించుకోలేకపోయింది. 6 రోజులకు భోళా శంకర్ వరల్డ్ వైడ్ షేర్ దాదాపు రూ. 27 కోట్లు. రూ. 79 కోట్ల వరల్డ్ వైడ్ బిజినెస్ చేసిన భోళా శంకర్ మరో రూ. 52 కోట్లు వసూలు చేస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు. అది అసాధ్యం కాబట్టి భోళా శంకర్ భారీ నష్టాలు మిగల్చనుంది.
మొదటి షో నుండే భోళా శంకర్ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. రొటీన్ స్టోరీ, అంతకు మించిన బ్యాడ్ స్క్రీన్ ప్లే చిత్ర ఫలితాన్ని దెబ్బతీశాయి. చిరంజీవి మేనియా, మేనరిజం, యాక్షన్ సన్నివేశాలు ఒకింత ప్రేక్షకుడికి ఉపశమనం కలిగించాయి. కేవలం చిరంజీవి కారణంగా ఈ మాత్రం వసూళ్లయినా సాధ్యం అయ్యాయి. భోళా శంకర్ ఫలితం చిరంజీవిని ఆలోచనలో పడేసింది.
భోళా శంకర్ తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా తెరకెక్కింది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర ఈ చిత్ర నిర్మాతగా ఉన్నారు. చిరంజీవికి జంటగా తమన్నా నటించింది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలు పాత్ర చేసింది. భోళా శంకర్ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఆగస్టు 11న వరల్డ్ వైడ్ విడుదల చేశారు.