https://oktelugu.com/

Krithi Shetty: కళ్ళతో చంపేస్తున్న బేబమ్మ.. తడిసిన జుట్టులో సూపర్ హాట్ కృతి శెట్టి!

కృతికి ఇక తిరుగులేదు అనుకుంటున్న సమయంలో ఆమెకు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ పడ్డాయి. కృతి గత నాలుగు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం నిరాశపరిచాయి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అయితే చెత్త సినిమాగా నిలిచింది.

Written By: , Updated On : August 17, 2023 / 09:22 AM IST
Krithi Shetty

Krithi Shetty

Follow us on

Krithi Shetty: ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కృతి శెట్టి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఉప్పెన వంద కోట్లకు పైగా వసూళ్లతో భారీ లాభాలు పంచింది. కృతి గ్లామర్ కి యూత్ ఫిదా అయ్యారు. యంగ్ కాలేజ్ గర్ల్ పాత్రకు ఆమె చక్కగా సరిపోయింది. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఉప్పెన సక్సెస్ కృతి శెట్టికి వరుస ఆఫర్స్ తెచ్చిపెట్టింది. ఉప్పెన అనంతరం నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సైతం హిట్ టాక్ తెచ్చుకోగా కృతి హ్యాట్రిక్ హిట్ చిత్రాల హీరోయిన్ గా అవతరించింది.

కృతికి ఇక తిరుగులేదు అనుకుంటున్న సమయంలో ఆమెకు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ పడ్డాయి. కృతి గత నాలుగు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం నిరాశపరిచాయి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అయితే చెత్త సినిమాగా నిలిచింది. నాగ చైతన్యకు జంటగా నటించిన కస్టడీ ఆమెకు హిట్ ఇస్తుందని భావించింది. అయితే కస్టడీ సైతం నిరాశపరిచింది.

వరుసగా నాలుగు ప్లాప్స్ ఇచ్చిన కృతికి తెలుగులో ఆఫర్స్ తగ్గాయి. స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకుంటే ఫేడ్ అవుట్ అయ్యే దశకు చేరుకుంది. ప్రస్తుతం కృతి తెలుగులో శర్వానంద్ కి జంటగా ఒక చిత్రం చేస్తుంది. అలాగే మలయాళంలో ఒక మూవీ, తమిళంలో మరొక చిత్రం చేస్తుంది. ఈ చిత్ర విజయాల మీదే కృతి కెరీర్ ఆధారపడి ఉంది. ఒక భారీ హిట్ పడితే గానీ ఆమెకు పూర్వ వైభవం రాదు.

ఈ క్రమంలో తనలోని హాట్నెస్ పరిచయం చేస్తుంది. వెండితెర మీద హోమ్లీ రోల్స్ చేసిన కృతి శెట్టి ఇంస్టాగ్రామ్ లో హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది. ఆ విధంగా పాపులారిటీ పెంచుకుంటుంది. అదే సమయంలో దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. తాజాగా కళ్ళతో కవ్విస్తూ సూపర్ గ్లామరస్ ఫోటో షూట్ చేసింది. కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.