Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు… సూపర్ స్టార్ కృష్ణ (Krishna) నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన తండ్రికి తగ్గ తనయుడిగా ఎదగడమే కాకుండా ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాను కూడా చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరిలాంటి క్రమంలోనే ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకులందరిలో ఒక చిరస్మరణీయమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలతో భారీ సక్సెస్ ను సాధించి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి కావాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా పరిధిని దాటి డైరెక్ట్ గా పాన్ వరల్డ్ సినిమా చేస్తూన్నాడు. ఇక ఇప్పటికే రాజమౌళి (Rajamouli) చెప్పిన కండిషన్స్ అన్నింటికి ఒప్పుకొని పూర్తిగా రాజమౌళి కి సరెండర్ అయిపోయిన మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ మీద పూర్తి ఫోకస్ ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పాన్ వరల్డ్ లో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి వీళ్లిద్దరూ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు ‘అత్తారింటికి దారేది’ (Attarintiki Daredi) అనే సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమాని మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు. అప్పుడు మహేష్ చాలా బిజీగా ఉండటం తో ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు.
Also Read : మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు డైలాగ్ రైటర్ గా మారిన స్టార్ డైరెక్టర్!
దాంతో త్రివిక్రమ్ ఆ మూవీని పవన్ కళ్యాణ్ తో చేసి సూపర్ డూపర్ సక్సెస్ సాధించమే కాకుండా తన ఖాతాలో ఇండస్ట్రీ హిట్ వేసుకున్నాడు. నిజానికి త్రివిక్రమ్ తో మహేష్ బాబు చేసిన మూడు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ సాధించలేదు. కానీ అత్తారింటికి దారేదితో పవన్ కళ్యాణ్ కి మాత్రం ఇండస్ట్రీ హిట్ అయితే దక్కింది.
అప్పుడున్న పరిస్థితుల్లో మహేష్ బాబు కనక సినిమా చేసి ఉంటే అతనికి కూడా ఇండస్ట్రీహిట్ దక్కేదని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. నిజానికి త్రివిక్రమ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికి చాలా మంచి విజయాలను అందించినప్పటికి మహేష్ బాబు విషయాల్లో మాత్రమే ఎప్పటికప్పుడు ఫెయిలవుతూనే వస్తున్నాడు.
ఇక గత సంవత్సరం వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాతో కూడా ఆయన ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయాడు. కారణం ఏదైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబుకి త్రివిక్రమ్ కి మంచి గుర్తింపైతే ఉంది. కానీ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా మాత్రం ఏదీ సక్సెస్ అవ్వకపోవడం వల్ల అభిమానులను తీవ్రమైన నిరాశకు గురిచేసిందనే చెప్పాలి.
Also Read : 3000 మందితో పడవలో మహేష్ బాబు పోరాటం..రాజమౌళి మార్క్ సన్నివేశం!